Breaking News

కలిసొచ్చిన రిపబ్లిక్‌ డే.. రికార్డు సాధించిన హనుమాన్‌

Published on Sat, 01/27/2024 - 13:32

అటు అయోధ్య రామమందిర ప్రారంభం ఎంత ఘనంగా జరిగిందో ఇటు హనుమాన్‌ కలెక్షన్స్‌ అంత భారీగా రాబడుతోంది. అక్కడ రాముడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ హనుమాన్‌ కోట్లాది రూపాయల వసూళ్లు రాబడుతున్నాడు. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో తేజ సజ్జ హీరోగా నటించాడు.

హనుమాన్‌ ప్రభంజనం..
ఇప్పటికే రెండు వందల కోట్ల క్లబ్బులో చేరి ఈ మూవీ అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్న గణతంత్ర దినోత్సవం కావడంతో వసూళ్ల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్‌ కేవలం 15 రోజుల్లోనే ఈ అరుదైన ఘనత సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్‌ చేతిలో 12 కథలు
ఇక హనుమాన్‌ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్‌ ఉంటుందని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే! ఇది భారీ బడ్జెట్‌తో పెద్ద ఎత్తున ఉండబోతుందని తెలిపాడు. సౌత్‌, బాలీవుడ్‌ హీరోలు కూడా ఇందులో ఉంటారని చెప్పాడు. ఈ ఒక్కటే కాదు తన దగ్గర మొత్తం 12 కథలు ఉన్నాయన్నాడు. మరి ఆ సినిమాలతో ప్రశాంత్‌ వర్మ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి!

చదవండి: వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతానన్న దర్శకుడు.. నటి ఎమోషనల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)