Breaking News

తారకరత్న కోసం బాలయ్య ఎంతో చేశారు.. ఎమోషనల్‌ అయిన అలేఖ్య రెడ్డి

Published on Tue, 03/14/2023 - 10:35

నందమూరి తారకరత్న మరణించి సుమారు నెల రోజులు కావొస్తుంది. ఇంకా ఆయన లేరన్న విషయాన్ని అభిమానులు, కుటుంసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తారకరత్న మరణంతో ఆయన బార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భర్తను తలుచుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంది. తాజాగా బాలయ్య చేసిన సాయాన్ని  గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసింది.

''మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన. కష్టసుఖాల్లో మాకు రాయిలా కొండంత అండగా నిలబడిన వ్యక్తి. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు తండ్రిలా, నీ బెడ్‌ పక్కనే కూర్చొని నీకోసం పాట పాడినప్పుడు అమ్మలా,నువ్వు రియాక్ట్‌ అవుతామో అని, నిన్ను నవ్వించడం కోసం జోక్స్‌ వేస్తూ సరదాగా కనిపించి, ఎవరూ లేని సమయంలో నీకోసం కన్నీరు పెట్టుకున్నారు.

చివరి క్షణం వరకు నీకోసం చాలా చేశారు. ఓబు(తారకరత్న ముద్దు పేరు)నువ్వు ఇంకొన్నాళ్లు ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం'' అంటూ అలేఖ్యరెడ్డి ఎమోషనల్‌ అయ్యింది. పిల్లలతో బాలయ్య ఉన్న ఫోటోకు తారకరత్నను యాడ్‌ చేసి ఎవరో ఆ పిక్‌ను అలేఖ్య రెడ్డికి పంపగా, ఇది ఎంతో బాగుందంటూ అలేఖ్య పేర్కొంది.

కాగా బాలయ్యకు తారకరత్న అంటే ఎంతో ఇష్టం. గుండెపోటుతో ఆసుపత్రికి తీసుకెళ్లిన దగ్గర్నుంచి అతని కట్టెకాలే వరకు ఆ కుటుంబానికి బాలయ్య పెద్దదిక్కులా నిలిచాడు. అంతేకాకుండా తారకతర్న-అలేఖ్యరెడ్డిల ప్రేమ వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోయినా బాలయ్య వాళ్లకు తోడులా ఉండి భరోసా ఇచ్చినట్లు తారకరత్న గతంలో పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)