Breaking News

వివాదంలో శివ కార్తికేయన్ పొంగల్ మూవీ..!

Published on Tue, 01/13/2026 - 16:16

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన పొంగల్ చిత్రం పరాశక్తి. పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వ వహించారు. జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి ఆది నుంచే వివాదాలు ఎదురయ్యాయి. రిలీజ్‌కు ముందు సెన్సార్‌ సమస్య ఈ సినిమా చివరికి అనుకున్న తేదీకే విడుదలైంది.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌ తర్వాత మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని.. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుల పరువుకు నష్టం కలిగించేలా చిత్రీకరించారని ఆరోపించింది.

చరిత్రను తప్పుదోవ పట్టించే సన్నివేశాలు ఉన్నాయని.. శివకార్తికేయన్‌ పాత్ర ఇందిరాగాంధీని కలిసినప్పటి సన్నివేశాలు.. చరిత్రలో జరగని సంఘటనలతో రూపొందించారని అ‍న్నారు. ఈ మూవీలో వాస్తవ సంఘటనలు చాలా తక్కువ ఉన్నాయని తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ భాస్కర్‌  పేర్కొన్నారు. కాగా.. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. 
 

Videos

Youtuber: ఇక నా వల్ల కాదు! అన్నీ ఆపేస్తున్నా

ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. మెగా హీరోలు..

పేర్ని నాని భోగి సంబరాలు

ఆ పేరు వింటే ఢిల్లీకి హడల్.. YS జగన్ పై నల్లగొండ గద్దర్ సాంగ్

యర్రగొండపాలెంలో కాకాణి సంక్రాంతి సంబరాలు

తాడేపల్లి YSRCP కార్యాలయంలో భోగి సంబరాలు

YS అవినాష్ రెడ్డి భోగి సంబరాలు

Kiran Kumar : YSRCP సర్పంచ్ కన్నుమూత

Delhi: పొంగల్ వేడుకల్లో ప్రధాని

Ravulapalem: మా ఊరి భోగి

Photos

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)