Breaking News

ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్‌ (TVK) పార్టీ ఉంది: మంత్రి

Published on Tue, 04/29/2025 - 10:56

తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్‌పై డీఎంకే నేత‌, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమకు పోటీ కేవలం డీఎంకే పార్టీ మాత్రమేనని విజయ్‌ ఇప్పటికే సందేశం పంపాడు. కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు చేస్తున్నారు కూడా..  అధికార పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు తాను ఉన్నానంటూ విజయ్‌ పలు వేదికలపై చెబుతున్నారు. దీంతో డీఎంకే మంత్రి పన్నీర్ సెల్వం తాజాగా విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా జరిగిన రాజకీయ సమావేశంలో విజయ్‌ పార్టీ గురించి మంత్రి పన్నీర్‌ సెల్వం కామెంట్స్‌ చేశారు. 'బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి మాకు అవినీతి గురించి పాఠాలు చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన తీసుకునే డబ్బు (రెమ్యునరేషన్‌) అంతా  బ్లాక్ మనీ అని అందరికీ తెలిసిందే.' అని ఆయన అన్నారు. ఆపై వేదికపై నుంచే విజయ్‌ పార్టీ (TVK) అంటే ఏంటి..?  దానికి సమాధానం చెప్పాలని జ‌న‌స‌మూహాన్ని  పన్నీర్‌ సెల్వం కోరారు. వెంటనే వారు (T-త్రిష, V- విజయ్‌, K- కీర్తి సురేష్‌) అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మీరంతా బ్రిలియంట్స్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని చెబుతుంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని నడపటం అంటే సినిమాలో నటించడం అంత సులభం అనుకుంటున్నారా.? అని మంత్రి ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట డీఎంకే పార్టీతో స్టాలిన్‌ తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం అక్కడ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ లీడర్‌గా స్టాలిన్‌ ఉన్నారని జాతీయ స్థాయి సర్వేలు కూడా తేల్చేశాయి. తర్వాతి రెండో స్థానంలో విజయ్‌ పార్టీ ఉందని ఆ సర్వేలు చెప్పాయి. అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2026 ఎన్నికల్లో విజయ్‌తో స్టాలిన్‌కు గట్టిపోటీ తప్పదని తెలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)