Breaking News

తమిళ హిట్‌ మూవీ జీవీ-2 ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Published on Mon, 08/15/2022 - 14:22

నటుడు వెట్రి కథానాయకుడిగా నటించిన జీవీ చిత్రం 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం జీవీ–2. వెట్రి హీరోగా, అశ్విని చంద్రశేఖర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రోహిణి, మైమ్‌ గోపి, కరుణాకరన్, రమల, సీనియర్‌ నటుడు వైజీ మహేంద్రన్, నాజర్‌ సోదరుడు అహ్మద్‌ ముఖ్యపాత్రలు పోషించారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన వీజే గోపీనాథ్‌నే రెండో భాగాన్నీ తెరకెక్కించారు. వీ హౌస్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేష్‌ కామాక్షి ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి కేఎస్‌ సుందరమూర్తి సంగీతాన్ని, ప్రవీణ్‌కుమార్‌ ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఈనెల 19వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్ర యూనిట్‌ చెన్నైలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమాన్, దర్శకుడు కె.భాగ్యరాజ్, నటుడు వైజీ మహేంద్రన శీను రామస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు గోపీనాథ్‌ మాట్లాడుతూ జీవీ చిత్రానికి స్టోరీ అందించిన బాబు తమిళ్‌ ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రానికి తానే కథను సిద్ధం చేశానని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను 22 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. చిత్ర నిర్మాత సురేష్‌ కామాక్షి మాట్లాడుతూ చిన్న చిత్రాలకు థియేటర్లో ఓపెనింగ్స్‌ రావడం కష్టంగా మారిందన్నారు.

ఆ మధ్య విడుదలైన మామనిదన్‌ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైందన్నారు.తరువాత ఆ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సాధించిందన్నారు. ఈ చిత్ర హీరో మంచి నటుడన్నారు. సీమాన్‌ మాట్లాడుతూ ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తమిళుల కోసం తీసుకురావాలన్న వారి ఆలోచనకే అభినందించాలన్నారు. ఇక్కడ అందరికీ బిరియాని లభించడం లేదని, కొందరు గంజితోనే బతుకుతున్నారన్నారు. సూర్య నటించిన సూరరై పోట్రు చిత్రం థియేటర్లలో విడుదల కాకపోయినా, ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణను పొందిందన్నారు. పొలం అనే తెలుగు చిత్రాన్ని తాను ఓటీటీలోనే చూశానని, అది అద్భుతమైన చిత్రమని ప్రశంసించారు. కాబట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీమాన్‌ పేర్కొన్నారు. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)