Breaking News

ఎంగేజ్‌మెంట్‌తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్‌

Published on Sat, 08/30/2025 - 13:30

'నడిగర్‌ సంఘం భవనం పూర్తయినప్పుడే నా పెళ్లి' అని శపథం చేశాడు స్టార్‌ హీరో విశాల్‌ (Vishal). దానికోసం తన వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. నిన్న (ఆగస్టు 29న) విశాల్‌ 48వ బర్త్‌డే.. ఈ పుట్టినరోజే తన పెళ్లిరోజు కానుందని గతంలో ప్రకటించాడు. కానీ ఇంకా నడిగర్‌ సంఘం భవంతి పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. హీరోయిన్‌ సాయిధన్సిక వేలికి ఉంగరం తొడిగాడు.

చివరి బ్యాచిలర్‌ బర్త్‌డే..
నిశ్చితార్థం తర్వాత విశాల్‌ మాట్లాడుతూ.. ఇది నా చివరి బ్యాచిలర్‌ బర్త్‌డే. ఎంగేజ్‌మెంట్‌ విషెస్‌ చెప్పిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. తొమ్మిదేళ్లుగా నడిగర్‌ సంఘం భవంతి కోసం ఎదురుచూస్తున్నాం. ఇంకో రెండు నెలల్లో అది పూర్తయిపోతుంది. ఈ బిల్డింగ్‌ కోసం పనిచేస్తున్నప్పుడే ధన్సిక, నేను కలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కటి కాబోతున్నాం. మేమిద్దరం ఇంతవరకు ఏ సినిమాలోనూ జంటగా నటించలేదు. 

అలాంటి సీన్లు చేయను
బిల్డింగ్‌ ప్రారంభోత్సవం అయిన మరుసటిరోజే నా పెళ్లి జరుగుతుంది. నా బ్యాచిలర్‌ లైఫ్‌ ముగియబోతోంది. కాబట్టి నేను చాలా మారాలి. అలా అని రొమాంటిక్‌ సినిమాలు చేయననుకునేరు, చేస్తాను! కానీ ఇకమీదట ముద్దు సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చాడు. విశాల్‌ ప్రస్తుతం 'మకుటం' మూవీ చేస్తున్నాడు. నిర్మాత ఆర్‌బీ చౌదరి కెరీర్‌లో ఇది 99వ చిత్రంగా రాబోతోంది. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విశాల్‌ మూడు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్నాడు.

 

చదవండి: ఐశ్వర్యరాయ్‌ మూవీ.. నటించేందుకు ఏ హీరో సాహసం చేయలేదు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)