Breaking News

హీరో కార్తీకి మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

Published on Fri, 01/13/2023 - 10:25

హీరో కార్తీకి మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022 అవార్డు వరించింది. కథానాయకుడిగా వరుస విజయాలను సాధిస్తున్నాడు హీరో కార్తీ. పరుత్తివీరన్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తొలి చిత్రంతోనే అమోఘ విజయాన్ని, ప్రశంసలను అందుకున్నాడు. గతేడాది విరుమాన్, పొన్నియిన్‌ సెల్వన్, సర్ధార్‌ చిత్రాల్లో నటించి వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించాడు. ఉళవన్‌ ఫౌండేషన్‌ అనే సేవా సంస్థను ప్రారంభించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలోని వ్యవసాయదారులను ప్రోత్సహించే విధంగా వారికి వెలుగునిచ్చే కార్యక్రమాలను చేపడుతున్నాడు.

వీటన్నింటిని గుర్తించిన ప్రముఖ టీవీ నిర్వాహకులు కార్తీకి మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2022 అవార్డును ప్రకటించారు. కాగా నటుడు కార్తీ ప్రస్తుతం విహారయాత్రలో భాగంగా స్పెయిన్‌ దేశంలో ఉండడంతో ఈ అవార్డును ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆయన తరఫున సర్ధార్‌ చిత్ర నిర్మాత, కార్తీ స్నేహితుడు లక్ష్మణన్‌ అందుకున్నాడు. ఈ సందర్భంగా కార్తీ నటనను, ఆయన సేవా కార్యక్రమాలను లక్ష్మణన్‌ కొనియాడాడు. కార్తీ తరపున ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కార్తీ ప్రస్తుతం జపాన్‌ చిత్రంలో నటిస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్‌సెల్వన్‌–2 ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

చదవండి: పఠాన్‌కు ఎంత తీసుకున్నావేంటి? షారుక్‌ రిప్లై ఏంటో తెలుసా?
నాటు నాటు.. ఆ పాటేంది? ఆ యాసేంది? ట్రోలింగ్‌పై నటి ఫైర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)