Breaking News

ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. కమల్ హాసన్ ఎమోషనల్

Published on Thu, 04/25/2024 - 13:12

ప్రఖ్యాత సినీ దర్శకుడు పసిదురై (84).. వృద్ధప్య సమస్యల కారణంగా సోమవారం కొడైక్కానల్‌లో కన్నుమూశారు. 1974లో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తమిళ చిత్రసీమలో రాణించారు. నిర్మాతగానూ పలు మూవీస్ చేశారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో కలిపి మొత్తంగా 46 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన అసలు పేరు దురై. కాగా 1979 ఈయన దర్శకత్వం వహించిన పసి చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి.. ఇలా మూడు విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రం పసి. తమిళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను, ఫిలింఫేర్‌ అవార్డులను గెలుచుకుంది. దీంతో దురై పేరు పసిదురైగా మారిపోయింది. పసి చిత్రంతో పాటు అవళుమ్‌ పెణ్‌దానే, ఆశై 60 నాళ్‌, పావత్తిన్‌ సంబళం, ఒరువీడు ఒరు ఉలగం, కిళింజల్‌గళ్‌ లాంటి చిత్రాలని ఈయన తీశారు. 

ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. హీరో కమలహాసన్‌ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తనని నటుడిగా మార్చడంలో మామ శీనివాసన్‌ (దురై) పాత్ర ఎంతో ఉందన్నారు. కాగా పసిదురైకి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 

(ఇదీ చదవండి: కారు కొన్న 'బిగ్‌బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)