Breaking News

తమిళ 'బిగ్‍బాస్'హోస్ట్‌ రేసులో ముగ్గురు స్టార్‌ హీరోలు

Published on Wed, 08/07/2024 - 21:16

తమిళ 'బిగ్‍బాస్' రియాల్టీ షో కోసం కొత్త హోస్ట్‌ వచ్చేస్తున్నాడు. ఏడు సీజన్ల వరకు లోకనాయుడు కమల్ హాసన్ హోస్ట్‌గా సక్సెస్‍ఫుల్‍గా నడిపారు. కమల్‌ ఇమేజ్‌తో ఈ షో పట్ల కోలీవుడ్‌లో మంచి బజ్‌ ఉంది. అక్కడ రేటింగ్స్‌ కూడా బాగానే బిగ్‌ బాస్‌ రాబట్టాడు. మరో కొద్దిరోజుల్లో సీజన్‌ 8 ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో కమల్‌ హాసన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్‌ నుంచి తాను హోస్ట్‌గా పనిచేయడంలేదని ప్రకటించారు. దీంతో కొత్తగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారని బిగ్‌ బాస్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

2017లో తమిళ్‌లో ప్రారంభమైన బిగ్‌ బాస్‌ తొలి సీజన్‌ నుంచి హోస్ట్‌గా కమల్ హాసన్ ఉన్నారు. అయితే, వచ్చే సీజన్‌లో తాను హోస్ట్‌గా కొనసాగడంలేదని చెప్పారు. తను ఒప్పుకున్న సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల్ వెల్లడించారు. కమల్‌ స్థానాన్ని భర్తి చేసేందుకు కోలీవుడ్‌ హీరో శింబు బిగ్‌ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   2022లో కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్‌ బాస్‌ నుంచి వైదొలిగినప్పుడు  శింబు  బిగ్ బాస్ అల్టిమేట్ షోను హోస్ట్ చేశాడు. 

ఇప్పుడు మళ్లీ  బిగ్ బాస్ షోను హోస్ట్ చేసేందుకు శింబు రానున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై  శింబు మేనేజర్‌ ఇలా తెలిపాారు. 'బిగ్ బాస్ షోకు నటుడు శింబు హోస్ట్ చేయబోతున్నాడన్న సమాచారంలో నిజం లేదని.. ఈ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని' ఆయన చెప్పారు. శింబు తర్వాత విజయ్ సేతుపతి, సూర్య పేర్లు ఆ లిస్ట్‌లో కనిపిస్తున్నాయి. సరికొత్తగా రమ్యకృష్ణ పేరును కూడా బిగ్‌ బాస్‌ యూనిట్‌ పరిశీలిస్తుందట. మరొ కొద్దిరోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)