అరుణాచలం కొండపై నటి.. జరిమానా

Published on Fri, 01/30/2026 - 07:35

పరమేశ్వరుడి ప్రతిరూపం అరుణాచలం.. అక్కడి పర్వతమే పరమాత్మగా ప్రాభవం పొందిన అరుణగిరిని దర్శించుకోవటం పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు. అయితే,  ఆలయం వెనుక వైపు 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరి ఉన్న విషయం తెలిసిందే. లక్షలాది మంది భక్తులు 14 కి.మీ దూరం గిరి ప్రదక్షిణ చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అక్కడ మరింత రద్దీగా ఉంటుంది. అక్కడ గిరి ప్రదక్షిణకు మాత్రమే అనుమతి ఉంటుంది. కొండ ఎక్కడానికి అటవీశాఖ వారు నిషేధం విధించారు. పవిత్రమైన అన్నామలై కొండపైకి అనుమతి లేకుండా నటి అర్చనా రవిచంద్రన్‌తో పాటు నటుడు అరుణ్ వెళ్లారు. అక్కడ వారిద్దరూ ఫోటోలను కూడా తీసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.  

వాటిని గుర్తించిన అటవీశాఖ అధికారులు ఇద్దరికి రూ. 5వేలు చొప్పున జరిమానా విధించారు. ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. అన్నామలై (అరుణాచల) కొండపైకి భక్తులు ఎక్కకూడదనడానికి ప్రధాన కారణం ఉంది.  ఆ కొండను స్వయంగా శివుడి రూపంగా పరిగణించడం వల్ల  ఎవరూ కొండపైకి వెళ్లకూడదని ఆంక్షలు ఉన్నాయి. కొండపైకి నేరుగా ఎక్కడం అపచారం. పవిత్రతకు విరుద్ధం అని భక్తులు భావిస్తారు. ఈ కొండను దేవాలయ గోపురంలా కాకుండా.. దేవుడి శరీరంగా భక్తులు భావిస్తారు. కాబట్టి దానిపై నడవడం, ఎక్కడం అనేది శివుని శరీరంపై నడిచినట్లుగా అవుతుంది. 
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)