Breaking News

చతికిలపడుతున్న తమిళ సీనియర్‌ హీరోలు..

Published on Fri, 12/19/2025 - 07:07

సినిమా అనే ప్రపంచంలో ఎప్పుడూ రేసు కొనసాగుతూనే ఉంటుంది.  ఇక్కడ ఎవరు ఎలాంటి కథలతో చిత్రాలు చేసినా అంతిమ లక్ష్యం విజయం సాధించడమే. తద్వారా ఆర్థికపరమైన లాభాలు ప్రధానాంశంగా మారతాయి. సినిమా శతాబ్ది వేడుకను జరుపుకున్నా ఇప్పటికీ ఈ ఫార్ములాలో ఎలాంటి మార్పులేదు. ఉండదు కూడా. వైవిధ్యం అనేది దర్శకుడి సృజనాత్మకతపైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రేక్షకులు మోనాటమిని అసలు ఇష్టపడడం లేదు. అది ఏ సూపర్‌స్టార్‌ హీరోగా నటించినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు.  ప్రస్తుతం కోలీవుడ్‌ సీనియర్‌ హీరోల సినిమాలకు గడ్డుకాలం ఏర్పడింది.

ఇందుకు చిన్న ఉదాహరణ ఇటీవల రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన వేట్టయన్, కూలీ మూవీతో పాటు కమలహాసన్‌ నటించిన థగ్‌ లైఫ్, విజయ్‌ నటించిన లియో, గోట్, అజిత్‌ నటించిన విడాముయర్చి , సూర్య నటించిన రెట్రో, కంగువ వంటి చిత్రాలే. అదేవిధంగా జయాపజయాలు ఎవరి చేతిలోనూ ఉండవన్నది జగమెరిగిన సత్యం. సినిమా, జయాపజయాలు అన్నవి నిరంత ప్రక్రియ. అయితే,  ప్రస్తుతం కోలీవుడ్‌ సీనియర్లు చతికిలపడుతున్నారా అనే చర్చ జరుగుతోంది.  ఇదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో ఇటీవల యంగ్‌ హీరోలు, కొత్త దర్శకులు దూకుడు చూపుతున్నారు. వారు చేసిన చిన్న చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఆదరణ లభిస్తుంది. పెద్ద హీరోల సినిమాలకు ప్రచారం ఎక్కువ. కానీ, కలెక్షన్స్‌ మాత్రం ఆ రేంజ్‌లో ఉండటం లేదు.

సినియర్‌ నటి సిమ్రాన్‌ కుడా ప్రస్తుతం సినిమాల విషయంలో జరుగుతున్న ఫాల్స్‌ ప్రచారాన్ని ఎండగట్టారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇటీవల టూరిస్ట్‌ ఫ్యామిలీ, డ్రాగన్, 3బీహెచ్‌కే వంటి చిత్రాలు మంచి ప్రశంసలు అందుకొవడంతో పాటు ,  రెండు వారాలు దాటిన తరువాత  కూడా థియేటర్లకు వెళ్లినా ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. అయితే పెద్ద పెద్ద స్టార్స్‌ నటించిన చిత్రాలే పలు కోట్ల రూపాయలు వసూళ్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాల మోత మోగుతోందన్నారు.  అయితే అలాంటి చిత్రాలు విడుదలైన వారం తరువాత వెళితే థియేటర్లలో ప్రేక్షకులే ఉండడం లేదన్నారు. అయినప్పటికీ అంత వసూలు, ఇంత వసూలు అని ఎందుకు ప్రచారం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని సిమ్రాన్‌ పేర్కొన్నారు.     

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)