Breaking News

రూ.50 లక్షల సాయం.. ఆ హీరో వల్లే నా కొడుకు ఇలా

Published on Mon, 04/13/2026 - 18:02

ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ అప్పుడప్పుడు కొందరు యాక్టర్స్, హీరోలు అనిపించుకుంటుంటారు. తమిళ హీరో శివకార్తికేయన్ కూడా అలాంటి ఓ పని చేశాడు. కాకపోతే ఇది చాన్నాళ్ల క్రితం జరిగినప్పటికీ సాయం పొందిన నటుడు ఇప్పుడా విషయం బయటపెట్టడంతో అదికాస్త వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

తమిళ హీరో శివకార్తికేయన్ చేసిన 'హీరో' సినిమాలో నటుడు ప్రేమ్ కుమార్ కూడా చేశాడు. అయితే ఈ చిత్రం చేస్తున్న టైంలోనే తన కొడుకు చదువు కోసం నెదర్లాండ్స్ వెళ్లాలని, సమయానికి చేతిలో డబ్బుల్లేవని.. పోని ఇల్లు తాకట్టు పెడదామా అంటే అది ఈఎమ్ఐలో ఉండటంతో బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు నిరాకరించాయని ప్రేమ్ అన్నాడు. ఈ విషయం శివకార్తికేయన్‌కి చెప్పగా బ్యాంకులో తన పేరిట పూచీకత్తుగా రూ.50 లక్షలు ఇప్పించాడని.. అలా తనకు సాయం చేయడంతో ఇప్పుడు తన కొడుకు నెలకు రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నాడని, దీనంతటికీ శివకార్తికేయన్ కారణమని ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చాడు.

ప్రేమ్-శివకార్తికేయన్ కలిసి ఓ సినిమాకు మాత్రమే పనిచేశారు. పరిచయం కూడా కొన్నాళ్లముందే జరిగింది. అయినా సరే తనని శివకార్తికేయన్ ఆదుకున్నాడని ప్రేమ్ చెప్పారు. హీరో, నిర్మాతగా బిజీగా ఉన్న శివకార్తికేయన్.. 'సెయాన్' అనే సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో ఇది థియేటర్లలోకి రానుంది. రీసెంట్‌గా 'తాయ్ కిళవి' మూవీతో నిర్మాతగానూ ఈ హీరో సూపర్ హిట్ కొట్టారు.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు 'దేవర' నిర్మాత కొత్త సినిమా)

Videos

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)