Breaking News

అదే ఫార్ములా ఫాలో అవుతున్న చిరు?

Published on Sun, 10/26/2025 - 21:26

రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి వరస సినిమాలైతే చేస్తున్నారు గానీ ఎందుకో అనుకున్నంతగా వర్కౌట్ కావట్లేదు. చాన్నాళ్ల క్రితం రూట్ మార్చిన చిరు.. వీలైనంత వరకు యువ దర్శకులతోనే కలిసి పనిచేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు మూవీస్ ఉన్నాయి. సెట్స్ పైన మాత్రం రెండింటి పనినడుస్తోంది. ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ బయటకొచ్చింది.

(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)

ప్రస్తుతం 'విశ్వంభర'తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' అనే మూవీ చేస్తున్నారు. ఇది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇందులో చిరుతో పాటు వెంకటేశ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ మేరకు కొన్నిరోజుల క్రితమే వెంకీ షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. ఇది పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు మరో మూవీ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓ రూమర్ వినిపిస్తుంది.

చిరు-బాబీ కాంబో ప్రాజెక్ట్ గురించి కొన్నాళ్ల క్రితం అనౌన్స్‌మెంట్ వచ్చింది. వచ్చే ఏడాది ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీలో తమిళ హీరో కార్తీ.. కీలక పాత్రలో నటించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇది నిజమే కావొచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా చిరు సినిమాల్లో ఎవరో ఓ హీరో అతిథి పాత్రల్లో కనిపిస్తూనే ఉన్నారు. 'ఆచార్య'లో రామ్ చరణ్, 'గాడ్ ఫాదర్‌'లో సల్మాన్ ఖాన్, 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ.. ప్రస్తుతం చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'లో వెంకటేశ్‌తో ఇలా ఫార్ములా ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తుంది. అలా కార్తీతో త్వరలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది.

(ఇదీ చదవండి: ఈ పాన్ ఇండియా నటుడిని గుర్తుపట్టారా? బయోపిక్ కోసం ఇలా)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)