Breaking News

హీరో మృతి.. నిద్రాహారాలు మానేయడంతో తల్లి కన్నుమూత!

Published on Fri, 10/13/2023 - 09:55

30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన తమిళ హీరో బాబు సెప్టెంబర్‌ 19న కన్నుమూసిన సంగతి తెలిసిందే! ఆయన మరణంతో బాబు తల్లి ప్రేమ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. నిద్రాహారాలు మానేసి చనిపోయిన కొడుకు గురించే కలవరించింది. ఈ క్రమంలో అస్వస్థతకు లోనైన ప్రేమ అక్టోబర్‌ 11న కన్నుమూసింది. కొడుకు చనిపోయిన మూడు వారాలకే తను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

ఆ ఒక్క సీన్‌ వల్ల జీవితమే నాశనం..
కాగా బాబు 'ఎన్‌ ఉయిర్‌ తొళన్‌' అనే సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలో రంగప్రవేశం చేశారు. ఈ చిత్రాన్ని దర్శకదిగ్గజం భారతీరాజా తెరకెక్కించాడు. ఈ మూవీ హిట్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో బాబుకు లెక్కలేనన్ని అవకాశాలు వచ్చాయి. దీంతో బాబు దాదాపు 10 సినిమాలకు సంతకం చేశారు. అందులో ఒకటి మనసారా వస్తుంగళెన్‌. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బాబు కొన్ని ఫైట్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించారు. ఈ క్రమంలో ఎత్తైన ప్రదేశం నుంచి ఆయన కిందకు దూకడంతో అతడికి తీవ్ర గాయాల్యాయి. వెన్నుముక విరిగిపోయి మంచానికి పరిమితమయ్యారు.

30 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంది
హీరోగా ఎదుగుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఆయన కెరీర్‌నే కాదు జీవితాన్నే తలకిందులు చేసింది. వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ అతడు నిటారుగా కూర్చోలేని పరిస్థితి! అప్పటినుంచి కొడుకుకు సపర్యలు చేస్తూ తనను కంటికి రెప్పలా చూసుకుంటోంది అతడి తల్లి ప్రేమ. మూడు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన బాబు ఇటీవలే కన్నుమూయడంతో ఆ బాధ తట్టుకోలేక తల్లి గుండె సైతం ఆగిపోయింది. కాగా గతంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించిన కె. రాజారం సోదరియే ప్రేమ.

సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి

చదవండి: శోభా ఓవరాక్షన్‌.. ఆటలో మరీ ఇంతలా దిగజారాలా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)