Breaking News

ఆధ్మాత్మిక సేవలో తరిస్తున్న తమన్నా, వీడియో..

Published on Wed, 02/08/2023 - 08:58

దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి తమన్నా భాటియా. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోల సరసన నటించి గుర్తింపు పొందింది. ఇటీవల బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాలు చేసింది. వాటిలో పేరు వచ్చినా ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. దక్షిణాదిలోనూ ఒకటీ, అర చిత్రాల్లో నటిస్తున్నా అదే పరిస్థితి. ఇటీవల తనకూ ఒక బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడంటూ అతనితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లోకి ఎక్కింది. ఈమెకు ఇప్పుడు పెళ్లిపై దృష్టి మళ్లినట్లు కనిపిస్తోంది. కారణం ఇటీవల ఎక్కువగా ఆలయాలు తిరుగుతూ.. పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక బాట పట్టింది. షూటింగ్‌లు లేని సమయంలో ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటోంది. కొన్ని నెలల క్రితం హిమాలయాలకు వెళ్లి అక్కడి ప్రసిద్ధి చెందిన వైష్ణవి దేవి ఆలయంలో విశేష పూజలు నిర్వహించింది. ఆ ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది.

తాజాగా ఈశా యోగా ప్రాంగణానికి కాషాయ దుస్తుల్లో వెళ్లి అక్కడ లింగభైరవి దేవిని దర్శించుకుంది. దీని గురించి ఆమె ఒక వీడియో విడుదల చేసింది. అందులో  ఈశా యోగాశ్రమం నుంచి ఆహ్వానం రావడంతో ఎంతో సంతోషానికి గురయ్యారని చెప్పింది. లింగ భైరవి దేవిని దర్శించుకోవడం ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగించిందని పేర్కొంది. అంతేకాకుండా జీవితంలో భయం, అపజయాల గురించి ఆందోళన దూరమవుతోందని చెప్పింది. లింగభైరవి విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్తానని పేర్కొంది. అక్కడి పరిసరాలు, లింగ భైరవి మూర్తీభం చూడగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక అనుభూతికి లోనైనట్లు పేర్కొంది. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో చిరంజీవికి జంటగా భోళాశంకర్, తమిళంలో రజనీకాంత్‌ సరసన జైలర్‌ చిత్రాల్లో నటిస్తోంది.

చదవండి: ఫుల్‌ ఖుషీలో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)