Breaking News

తమన్నా బ్రేకప్‌.. విడి విడిగా వచ్చారు.. విడిపోయినట్లేనా!

Published on Sat, 03/15/2025 - 11:18

ప్రేమలో ఉన్న మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah Bhatia), బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ (Vijay Varma ) విడిపోయినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్‌ చెప్పుకున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు తమన్నా, ఇటు విజయ్‌ స్పందించకపోవడంతో నిజంగానే విడిపోయారని అంతా భావించారు. 

ఇలాంటి సమయంలో తమన్నా, విజయ్‌ తీవ్రమైన బాధలో ఉంటారని అభిమానులు ఊహించారు. కానీ ఇద్దరిలోనూ బ్రేకప్‌ అయిన బాధే కనిపించడంలేదు. నిన్న జరిగిన హోలీ వేడుకల్లో ఇద్దరు ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ ఏర్పాటు చేసిన హోలీ సంబరాలకు తమన్నా,విజయ్‌ హాజరయ్యారు. ప్రేమలో ఉన్నప్పుటు కలిసి వచ్చిన ఈ జంట.. నిన్న మాత్రం విడి విడిగా వచ్చి సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. 

అయితే ఇద్దరు ముఖాల్లోనూ బాధలేదు. నవ్వుతూ ఎంట్రీ ఇచ్చారు.ఫోటోగ్రాఫర్లకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ వెళ్లిపోయారు. ఇలా ఇద్దరు వేరు వేరు ఈవెంట్‌కి వచ్చి వెళ్లడంతో మరోసారి తమన్నా, విజయ్‌ల బ్రేకప్‌ టాపిక్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతోంది.

‘లస్ట్‌ స్టోరీస్‌ 2’(2023) వెబ్‌ సిరీస్‌లో తమన్న, విజయ్‌ వర్మ కలిసి నటించారు. అదే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమన్నా పలు ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఇంతలోనే వీరిద్దరు విడిపోయారు. 

ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుందామని తమన్నా అడిగితే..విజయ్‌ మాత్ర అందుకు నో చెప్పాడట. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఇంకొంత కాలం కెరీర్‌పై ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నట్లు విజయ్‌ అన్నాడట. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి..చివరకు విడిపోయారని బాలీవుడ్‌ టాక్‌.అయితే బ్రేకప్‌పై మాత్రం వీరిద్దరూ ఎక్కడా స్పందించలేదు. 
 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)