Breaking News

తమన్నా చిందులు గోవాలో...సన్నీలియోన్‌ సయ్యాట హైదరాబాద్‌లో...

Published on Tue, 12/30/2025 - 12:09

గుడ్‌బై 2025 అంటూ వీడ్కోలు పలకడం,  వెల్క్‌మ్‌ 2026 అంటూ స్వాగతం చెప్పడం..  కోసం ప్రపంచం సకల సన్నాహాలతో సిద్ధమైంది.  న్యూ ఇయర్‌ వేడుకలలో టాక్‌ ఆఫ్‌ ద ఈవెంట్స్‌గా నిలిచే ముఖ్యమైన అంశం సెలబ్రిటీల ప్రదర్శన. అదే క్రమంలో భారతీయ సినీ సెలబ్రిటీలు పలువురు రానున్న  నూతన సంవత్సర వేడుకలలో  ప్రదర్శన ఇస్తున్నారు. అందులో ఇప్పటివరకూ నిర్ణయమైన వాటిలో చెప్పుకోదగ్గ ఈవెంట్‌ గోవాలో జరుగుతోంది. మన మిల్క్‌ బ్యూటీ, తాజా ఐటమ్‌ నంబర్‌ల క్వీన్‌గా పేరొందిన తమన్నా అందులో పాల్గొంటోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం తమన్నా గోవాలోని  బీచ్‌ ఫ్రంట్‌ హోటల్‌కు చేరుకుంది. అదే విధంగా బాలీవుడ్‌ నటి, రొమాంటిక్‌ చిత్రాల బ్యూటీ సన్నీ లియోన్‌ తెలంగాణ రాజధాని నగరంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటోంది. 

ఈ నూతన సంవత్సర వేడుకల్లో ప్రముఖ గాయకుడు రామ్‌ మిరియాల సైతం ఆమెకు జత కలవనున్నాడు. అదే విధంగా  ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ గోవా, లక్నో... ఇతర ప్రధాన నగరాల్లో జరిగే కార్యక్రమాలలో సినిమా ప్రముఖులు పాల్గొంటున్నారు.

–గోవాలో బాలీవుడ్‌ నైట్‌ క్లబ్‌గా పేర్కొనే లాస్‌ ఒలాస్‌లో నటి తమన్నా, మరో నటి సోనమ్‌ బజ్వాలతో పాటు మ్యుజిషియన్‌ మిళింద్‌ గాబాలు పాల్గొంటున్నారు.

–ప్రముఖ నేపధ్యగాయని సునీత కూడా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న న్యూ ఇయర్‌ వేడుకల్లో గళం కలుపుతున్నారు.

–ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌... విజయవాడలో జరుగుతున్న ఈవెంట్‌లో సందడి చేయనున్నాడు.

–ఢిల్లీలో ది లీలా యాంబియెన్స్ కన్వెన్షన్‌ హోటల్‌  జరిగే ‘డాజిల్‌ ఫ్రమ్‌ ది –ఈస్ట్‌‘ కార్యక్రమంలో పంజాబీ గాయకుడు, నటుడు జాస్సీ గిల్‌ – బబ్బల్‌ రాయ్‌ జంట  ప్రత్యక్ష ప్రదర్శనలను అందిస్తుంది.

–హిందీ గాయని సప్నా చౌదరి – రేణుకా పన్వర్‌ లు ఢిల్లీలోని షాహ్దారాలో జరిగే ‘ఎపిక్‌ నైట్‌ అవుట్‌‘ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తోంది.

–ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ హైదరబాద్‌కి వస్తున్నాడు. నగరంలో జరుగుతున్న ఓ నూతన సంవత్సర వేడుకకు హాజరవుతున్నాడు.

–బాలీవుడ్‌ గాయని, నటి సునంద శర్మ: ఢిల్లీలోని లే మెరిడియన్‌ గుర్గావ్‌లో నిర్వహిస్తున్న విలాసవంతమైన నూతన సంవత్సర వేడుకలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనుంది.

––న్యూజిలాండ్‌కు చెందిన బాలీవుడ్‌ గాయని షిర్లీ సెటియా  ‘బిగ్‌ బ్యాంగ్‌ బెంగళూరు‘ కార్యక్రమంలో ఆటపాటలతో అలరించనుంది.

–మాజీ బాలీవుడ్‌ నటి ర్యాప్‌ గాయని ఉదితా గోస్వామి బెంగళూరులోని స్టార్‌ హోటల్‌ హై అల్ట్రా లాంజ్‌లో జరిగే న్యూ ఇయర్‌ పార్టీలో పాల్గొంటోంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)