11 వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా మిత్ర పక్షాలపై ఇరాన్ దాడులు
Breaking News
ఇరుముడి సినిమాలో..?
Published on Wed, 03/11/2026 - 00:12
‘ఇరుముడి’ సినిమాలో తమన్నా భాగమయ్యారనే టాక్ వినిపిస్తోంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్, ఆమె కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు.
కాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ తమన్నాను సంప్రదించారని, కథ, పాత్ర నచ్చడంతో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా 2015లో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో తమన్నా ఓ హీరోయిన్‌గా నటించారు.
మళ్లీ పదేళ్ల తర్వాత రవితేజతో తమన్నా స్క్రీన్ షేర్ చేసుకుంటారా? మరి... ‘ఇరుముడి’ చిత్రంలో తమన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
Tags : 1