Breaking News

డేటింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్న తమన్నా

Published on Wed, 11/15/2023 - 06:38

నటన కంటే, గ్లామర్‌ డాల్‌ గానే ముద్ర వేసుకున్న హీరోయిన్లలో తమన్నా భాటియా ముందుంటుంది. అలాగని ఈమెలో మంచి నటి లేదని చెప్పలేం. బాహుబలి లాంటి చిత్రాల్లో తమన్నా ఇరగదీసింది. అయితే ప్రతిభను చాటే అవకాశాలు ఎక్కువగా ఈమెకు రాలేదన్నది వాస్తవం. అందుకు కారణం ఈమెలోని అందం, అభినయాన్ని డామినేట్‌ చేయడమే. ఇక నిజం చెప్పుకోవాలంటే గ్లామరస్‌ పాత్రలే ఈ మిల్కీ బ్యూటీని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఏదేమైనా 18 ఏళ్లుగా కథానాయకిగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న తమన్నా తాజాగా మలయాళం ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

అక్కడ మరిన్ని అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు కానీ, నిజానికి ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మరో పక్క ఇప్పటి వరకూ నటనపైనే దృష్టి పెట్టినట్లు స్టేట్‌మెంట్స్‌ ఇచ్చిన తమన్నా ఇప్పుడు తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేస్తోందనిపిస్తోంది. బాలీవుడ్‌ నటుడు విజయవర్మతో చాలాకాలంగా సీక్రెట్‌ లవ్‌ను మెయింటైన్‌ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఇటీవలే తన ప్రేమ గుట్టును విప్పింది. ఆ తరువాత పార్టీలకు, ప్రైవేట్‌ ఫంక్షన్‌ లకు విచ్చలవిడిగా తిరిగే స్తున్నారు జంట. ఇక అసలు విషయానికి వస్తే ఈ సంచలన జంట కోసం పెళ్లి పీటలు ఎదురు చూస్తున్నాయని తాజా సమాచారం.

ఇప్పటివరకు చేసిన డేటింగ్‌ చాలు, ఇకనైనా పెళ్లి చేసుకోమని తమన్నా భాటియా ఇంట్లో ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో బ్యూటీ కూడా తాళి కట్టు శుభవేళకు సిద్ధం అవుతున్నారనే టాక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా దీపావళి పండుగను ఈ జంట కలిసి జరుపుకోవడం కూడా తమన్నా భాటియా పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వస్తున్న వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)