Breaking News

క్షమించండి.. పోలీసుల విచారణకు రాలేను: తమన్నా

Published on Mon, 04/29/2024 - 14:49

ఐపీఎల్‌ కేసులో చిక్కుకున్న సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ తమన్నాకు నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లను ‘ఫెయిర్‌ ప్లే’ యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. నేడు ఎప్రిల్‌ 29న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లను ‘పెయిర్‌ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్‌ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్‌’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ఈ యాప్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూడాలంటూ తమన్నా, సంజయ్‌ దత్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్‌ దత్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి. తమన్నా నేడు విచారణకు రావాల్సి ఉంది. కానీ ఆమె హాజరుకాలేదు.  షూటింగ్‌ పనుల వల్ల ఆమె అందుబాటులో లేదని, మరో రోజు విచారణకు వస్తారని ఆమె తరపున ఉన్న లాయర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం సాక్షిగా మాత్రమే ఆమెను విచారణకు పోలీసులు పిలిచారు. ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2023 స్ట్రీమింగ్ రైట్స్‌ను రూ. 23 వేల కోట్లకు పైగానే వ‌యాకామ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ హక్కులన్నీ కూడా ఆ సంస్థకు మాత్రమే ఉన్నాయి. కానీ, ఆ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మిస్తూ ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్ త‌మ ఛానెల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను లైవ్ స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో త‌మ‌కు భారీగా న‌ష్టం వాటిల్లింద‌ని మ‌హారాష్ట్ర సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు 'వ‌యాకామ్' వారు ఫిర్యాదుచేశారు. దీంతో ఆ యాప్‌ను ప్రమోట్‌ చేస్తున్న సినిమా ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)