Breaking News

జీవితంలో ఒక్కసారే ఇలాంటి చాన్స్‌ వస్తుంది: తమన్నా

Published on Sun, 02/23/2025 - 01:32

‘‘మహా కుంభమేళా జీవితంలో ఒక్కసారే వస్తుంది. అలాగే ‘ఓదెల 2’ లాంటి సినిమాలో నటించే అవకాశం కూడా జీవితంలో ఒక్కసారే వస్తుంది’’ అని తమన్నా అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్‌. సింహ, యువ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంపత్‌ నంది పర్యవేక్షణలో అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై డి. మధు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌ కానుంది.

ప్రయాగ్‌ రాజ్‌లోని మహా కుంభ మేళాలో త్రివేణి సంగమం వద్ద నాగ సాధువుల సమక్షంలో ‘ఓదెల 2’ టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘సంపత్‌ నంది విజన్‌ని దర్శకుడు అశోక్‌ తేజ అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చాడు. సంపత్‌ నందిగారితో నాలుగు సినిమాలు సైన్‌ చేశాను. కానీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. సంపత్‌ నంది మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత తమన్నా మాంసాహారం తినడాన్ని మానేశారు.

‘అమ్మోరు’లో సౌందర్యగారిని, ‘అరుంధతి’ మూవీలో అనుష్కగారిని ఎంత ఆరాధించామో... అలా ఈ సినిమాతో తమన్నా కూడా ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అవకాశం ఇచ్చిన సంపత్‌ నందిగారికి, తమన్నా, డి. మధుగార్లకు ధన్యవాదాలు’’ అని తెలిపారు అశోక్‌తేజ. ‘‘ఇది థియేటర్స్‌లో చూడాల్సిన చిత్రం’’ అన్నారు డి. మధు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)