Breaking News

విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా

Published on Tue, 07/04/2023 - 16:22

బాలీవుడ్‌ వరుస వెబ్ సిరీస్‌లతో మిల్కీ బ్యూటీ తమన్నా ఓటీటీని షేక్ చేస్తోంది. అత్యంత శృంగార సన్నివేశాల్లో నటిస్తూ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవలే రిలీజైన జీ కర్దా, లస్ట్ స్టోరీస్‌-2లో తమన్నా తన రొమాంటిక్ సీన్లతో ఓ రేంజ్‌లో వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోళాశంకర్‌లో నటిస్తోన్న భామ.. వెబ్ సిరీస్‌ల్లో మరింత బోల్డ్‌ కనిపించింది. దీంతో తమన్నాపై కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సీన్స్ ఎందుకు చేస్తున్నారంటూ మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అయితే గతంలో ఎంసీఏ విలన్ విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సమయంలోనే తాము ప్రేమలో పడ్డామని తెలిపింది. ఇటీవల ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

(ఇది చదవండి: మందు కొట్టి తీశారా?.. ఆదిపురుష్ మేకర్స్‌పై నటుడు ఆగ్రహం!)

తమన్నా మాట్లాడుతూ.. 'విజయ్‌ వర్మకు స్త్రీలంటే చాలా గౌరవం. అతను నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అందుకే నేను అతన్ని ప్రేమించా. తన కుటుంబ సభ్యులపై ప్రేమాభిమానులు ఎక్కువే. ఇంట్లో వాళ్లను గౌరవించేవారు.. బయటి వారితో అలాగే ఉంటారని నమ్ముతా. ఇతరులను గౌరవించడం నేటి యువత నేర్చుకోవాలి. ఇతరులతో ఎలా ఉండాలో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. మహిళలు ప్రతి విషయంలో రాజీపడాలనే భావనను అంగీకరించను.' అని అన్నారు. అయితే తన వెబ్‌ సిరీస్‌లపై వస్తున్న విమర్శలపై తమన్నా స్పందించారు.  

తమన్నా మాట్లాడుతూ.. 'ఈ జనరేషన్‌లో‌ కూడా ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తారనుకోలేదు. ఇలా విమర్శలు చేస్తారని ఊహించలేదు. హీరోలు ఎలాంటి పాత్రలు చేసినా ప్రశంసిస్తారు. వారిని ఏమి అనరు. కానీ హీరోయిన్స్‌ నటిస్తే మాత్రం విమర్శలు చేస్తారు. ఇదెక్కడి న్యాయం నాకర్థం కావడం లేదు. కెరీర్‌లో ఎదగాలంటే మన నిర్ణయాలను మార్చుకోవాలి. అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. 

(ఇది చదవండి: ప్రముఖ యూట్యూబర్‌కు ప్రాణాంతక వ్యాధి.. ఇంతకీ ఏమైందంటే?)

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)