Breaking News

ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్

Published on Tue, 04/15/2025 - 14:47

మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. గతేడాది కేవలం ఐటమ్ సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ సారి లేడీ ఓరియంటెడ్ మూవీతో అభిమానుల ముందుకు రానుంది. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఓదెల-2 ఈ వారంలోనే థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.

రిలీజ్‌కు రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరోయిన్‌ తమన్నా కూడా హాజరైంది. ఈ సందర్భంగా తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది. టాలీవుడ్ హీరో శర్వానంద్‌తో కలిసి పని చేయాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టింది. కాగా..ఈ ఈవెంట్‌కు శర్వానంద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తమన్నా మాట్లాడుతూ.. 'శర్వానంద్‌తో తాను ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఇప్పటివరకు  కలిసి పని చేయలేదు. సంపత్‌నంది గారితో మీరు నెక్ట్స్ సినిమా చేయాలని కోరుకుంటున్నా. త్వరలోనే మీతో కలిసి సినిమా చేయాలని ఉంది' అని అన్నారు. కాగా.. అశోక్ తేజ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ థ్రిల్లర్ మూవీ ఈనెల 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)