Breaking News

అతడితో ప్రేమలో పడ్డా, కానీ.. తాప్సీ బ్రేకప్‌ స్టోరీ

Published on Fri, 12/22/2023 - 10:01

తాను ఎప్పుడో ప్రేమలో పడ్డానంటోంది హీరోయిన్‌ తాప్సీ. ఈ ఉత్తరాది బ్యూటీ మొదట కథానాయికగా పాపులర్‌ అయింది దక్షిణాది చిత్రాలతోనే. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల దర్శక నిర్మాతలే ఈమెను స్టార్‌ హీరోయిన్‌ను చేశారు. ధనుష్‌ హీరోగా వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన ఆడుగళం చిత్రం ద్వారా తాప్సీ కోలీవుడ్‌లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వందాన్‌ వెండ్రాన్‌, కాంచన 3, గేమ్‌ ఓవర్‌ తదితర చిత్రాల్లో నటించింది. అదే విధంగా తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ అక్కడ స్టార్‌ హీరోల సరసన నటించింది.

బాలీవుడ్‌లో బిజీ
ఇలా దక్షిణాది చిత్రాల్లో నటిస్తుండగానే బాలీవుడ్‌ నుంచి పిలుపువచ్చింది. అక్కడ నటించిన తొలి చిత్రం బేబీ మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలు వరించాయి. హిందీలో పలు లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాల్లోనూ నటించి విజయాలు సాధించింది. ఆ మధ్య అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన పింక్‌ సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా షారుక్‌ ఖాన్‌ సరసన నటించిన డంకీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది.

సీనియర్‌తో లవ్‌..
బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న తాప్సీ ఇటీవల ఒక భేటీలో తన సినీ పయనం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. తాను తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డానని చెప్పింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రేమించానని చెప్పింది. మొదట్లో అతను తనపై ఆసక్తి చూపాడని, ఆ తరువాత చదువు పాడై పోతుందని భావించి తనకు దూరం అయ్యాడని పేర్కొంది. చదువుపై శ్రద్ధ పెట్టాలని తనకు ఉచిత సలహా కూడా ఇచ్చాడని తెలిపింది. తన తొలి ప్రేమ విఫలం నుంచి బయట పడటానికి చాలా కాలం పట్టిందని తాప్సీ వెల్లడించింది.

చదవండి: మాజీ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్టార్‌ హీరో 'విన్ డీజిల్‌'

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)