Breaking News

హాలీవుడ్ బ్యూటీకి జాక్‌పాట్‌.. ఏకంగా రూ.530 కోట్లా?

Published on Wed, 09/17/2025 - 22:10

సినీ ఇండస్ట్రీలో పారితోషికాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్హీరోలకైతే ఏకంగా వంద కోట్లు ముట్టజెప్పాల్సిందే. కొందరు బిగ్స్టార్స్ఏకంగా వంద కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్ల విషయానికొస్తే పారితోషికాలు అంత ఎక్కువగా ఉండవు. హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్లో పదిశాతం కూడా ఉండకపోవచ్చు. అలాంటిది ఒక హీరోయిన్కు వందల కోట్ల రూపాయలు ఆఫర్చేస్తే ఎలా ఉంటుంది? అది మన బాలీవుడ్సినిమాలో ఇంతలా భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా? అయితే స్టోరీ చదివేయండి.

ప్రముఖ హాలీవుడ్హీరోయిన్ సిడ్నీ స్వీనీ కోసం బాలీవుడ్ మేకర్స్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. 'యుఫోరియా', 'ది వైట్ లోటస్' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న సిడ్నీ త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ బాలీవుడ్ చిత్రంలో నటించడానికి బిగ్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.

ఓ నివేదిక ప్రకారం 28 ఏళ్ల సిడ్నీ స్వీనికి ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 530 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చేందుకు సంప్రదించిందని టాక్. ఒకవేళ ఆమె డీల్ అంగీకరిస్తే బాలీవుడ్సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ 2026 ప్రారంభంలో షూటింగ్మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మూవీ షూటింగ్ న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ జరగనుందని సమాచారం. మొదట ఈ ఆఫర్ చూసి సిడ్నీ స్వీనీ ఆశ్చర్యపోయిందని నివేదికలో వెల్లడించింది. అయితే బిగ్డీల్కు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విషయంపై సిడ్నీ తరఫున ప్రతినిధులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం సిడ్నీ స్వీనీ 'క్రిస్టీ' అనే మూవీలో నటిస్తోంది. చిత్రంలో యూఎస్ పోరాట యోధురాలు క్రిస్టీ మార్టిన్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. తర్వాత సిడ్నీ నటించిన మరో చిత్రం 'ది హౌస్‌మెయిడ్' డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Videos

KSR Live Show: ప్రభుత్వ మెడికల్ కాలేజీల చరిత్రలో చీకటి రోజు

మారని పాక్ బుద్ధి.. బాల్ తో అంపైర్ పై దాడి

ఉడతతో స్నేహం

సాక్షి రిపోర్టర్ పై పోలీసుల దౌర్జన్యం

మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము

Watch Live: ఛలో మెడికల్ కాలేజ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతా.. బైరెడ్డి మాస్ వార్నింగ్

17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

మహేష్ తో ప్రభాస్ డైరెక్టర్.. స్క్రీన్స్ బ్లాస్ట్ పక్కా

Photos

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)