Breaking News

విదేశీయుడి నోట RRR సాంగ్‌.. నోరెళ్లబెట్టిన హైదరాబాదీ

Published on Sun, 07/06/2025 - 12:40

తెలుగువారు ఇద్దరు కలిసి కనిపించినా తెలుగులో మాట్లాడకపోవచ్చు. కొందరి విషయంలో మనం ఇలాంటి సంఘటనలు చూసే ఉంటాం. వారి కారణాలు చాలా ఉండవచ్చు.  కొందరు ఇంగ్లీషు లేదా ఇతర భాషలను ఇష్టపడుతూ మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. వారు తమ భాషా పరిజ్ఞానం ఇతరులకు చూపించుకోవాలని కూడా తాపత్రయం పడుతుంటారు. అయితే, ఒక విదేశీయుడు స్వచ్ఛమైన తెలుగు భాషలో పాట పాడితే ఎలా ఉంటుంది..?  అది కూడా తప్పులు, తడబాటు లేకుండా ఆలపిస్తే విన సొంపుగా ఉంటుంది. అలాంటి ఘటనే ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

స్వీడన్‌కు చెందిన దేవ్‌ ఒక లండన్‌లోని ఒక హోటల్‌లో కూర్చొని ఉండగా అక్కడికి మన హైదరాబాద్‌కు చెందిన యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. ఇంతలో పరిచయం చేసుకుంటున్న క్రమంలో ఎక్కడి నుంచి వచ్చావ్‌ బ్రదర్‌ అని అడగ్గానే హైదరాబాద్‌ అని చెప్పాడు. దీంతో దేవ్‌ వెంటనే RRR సినిమా నుంచి అదిరిపోయే సాంగ్‌  'పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు' అంటూ పోలేరమ్మ జాతరలో పోతరాజులా ఊగిపోతూ పాట అందుకున్నాడు. ఇంకేముంది మన హైదరాబాద్‌ యువకుడు ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

స్వీడన్‌కు చెందిన దేవ్‌కు భారత్‌ అంటే చాలా ఇష్టం. తనకు హిందీతో పాటు తెలుగు, అస్సామీ వంటి భాషలు కూడా వచ్చు. గోవా, ముంబైలో ఎక్కువ రోజులు ఉన్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తనకు బాగా నచ్చడంతో అందులోని సాంగ్‌కు అతను ఫ్యాన్‌ అయిపోయాడు. ఈ పాట కూడా ఫారిన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో తనకు బాగా నచ్చి ఉండొచ్చు. విదేశీయుడు కావడంతో అతనికి కొన్ని సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో కూడా తను నటించాడు.
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)