Breaking News

సిరివెన్నెల స్మృతిలో 'స్వప్నాల నావ' సాంగ్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్

Published on Thu, 02/20/2025 - 20:50

మనసంతా నువ్వే,  నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు వీఎన్ ఆదిత్య తాజా ప్రాజెక్టు 'స్వప్నాల నావ'. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డల్లాస్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గోపీకృష్ణ కొటారు ఈ సాంగ్‌ను రూపొందించారు. అంతే కాకుండా గోపికృష్ణ కుమార్తె శ్రీజ ఈ పాటను ఆలపించడంతో పాటు నటించారు.

ఈ'స్వప్నాల నావ' థీమ్ దివంగత స్టార్ లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందించారు . ఈ పాటకు ప్రముఖ సినీ నిర్మాత శ్రీమతి మీనాక్షి అనిపిండి సమర్పకులుగా వ్యవహరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని. యశ్వంత్ ఈ పాటకి సాహిత్యం అందించారు.

'సిరివెన్నెల సీతారామశాస్త్రి' అంటే దర్శకులు వి.ఎన్.ఆదిత్యకు ఎంతో అభిమానం. ఆయన సూపర్ హిట్ సినిమా 'మనసంతా నువ్వే' లో కూడా సిరివెన్నెలతో గుర్తుండిపోయే ఓ పాత్రని చేయించారు. ఇప్పుడు 'స్వప్నాల నావ' తో సిరివెన్నెల గొప్పతనాన్ని, అభిమానాన్ని  చాటుకున్నారు. అందుకే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో 1 మిలియన్ వీక్షణలు వచ్చాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)