Breaking News

ఈవెంట్‌లో మాజీ భాయ్‌ ఫ్రెండ్‌.. అస్సలు పట్టించుకోని బాలీవుడ్ హీరోయిన్!

Published on Fri, 04/11/2025 - 16:46

బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న భామ.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో అభిమానులను ‍అలరిస్తోంది. సూపర్ హిట్ సిరీస్‌ ఆర్యలో నటించింది. అంతేకాకుండా తాళి అనే వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించని సుస్మితా సేన్.. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైంది. ముంబయిలో జరిగిన ఈ ఈవెంట్‌లో తన మాజీ భాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా.. సుస్మితా సేన్  నటుడు రోహ్మన్‌ షాల్‌తో డేటింగ్‌ చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. తాజాగా వీరిద్దరు మరోసారి ఓకే ఈవెంట్‌లో మెరవడంతో బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఈ జంట మళ్లీ కలవబోతున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈవెంట్‌లో రోహ్మాన్‌ షాల్‌ను సుస్మితాతో ఫోజు ఇవ్వాలని అక్కడున్న వారు అడగడంతో సరదాగా వెనక నిలబడి కెమెరాకు పోజులిచ్చాడు. అయితే సుస్మితా మాత్రం అతన్ని పట్టించుకోకుండా తన స్నేహితులతో మాట్లాడుతూ కనిపించింది.

కాగా.. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్‌లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్‌.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది.  

 

 

 

 

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)