Breaking News

మరోసారి అత్తయ్యను అయ్యాను: సుస్మిత

Published on Sun, 02/01/2026 - 11:33

మెగా ఫ్యామిలీలో ట్విన్స్‌ రాకతో సందడి నెలకొంది. సినీ నటుడు రామ్ చరణ్‌, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు. జనవరి 31న ఉపాసనకు ఓ మగ, ఆడ శిశువు జన్మించారు. ఇదే విషయాన్ని అధికారికంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రకటించారు. తల్లీ, ఇద్దరు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి హెల్త్‌ బులిటెన్‌ కూడా రిలీజ్‌ చేసింది. ఇప్పటికే రామ్‌ చరణ్‌ దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా ట్విన్స్‌ రాకతో  సుస్మిత స్పందించారు.

మరోసారి అత్తయ్యను అయ్యాను
రామ్‌ చరణ్‌ దంపతులకు సుస్మిత కొణిదెల త‌న సోష‌ల్ మీడియా ద్వారా సంతోషం వ్య‌క్తం చేసింది.2026 సంవ‌త్స‌రం ప్రారంభం నుంచే తమ కుటుంబానికి ఆనందాన్ని తెచ్చిందని పేర్కొంది. సోదరుడు చరణ్‌, ఉపాసనలు  తనను మరోసారి అత్తయ్యను చేశారని సంతోషంగా చెప్పుకొచ్చింది. అయితే, ఈసారి తన ఆనందం రెట్టింపుగా ఉందని సుస్మిత తెలిపింది.

మీ అన్నయ్య ఎదురుచూస్తున్నాడు
రామ్ చరణ్‌, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో నటి లావణ్య త్రిపాఠి సంతోషం వ్యక్తం చేసింది. 'చిన్న కవలలకు స్వాగతం. మీరిద్దరూ ఇప్పటికే ఎంతో ప్రేమను పొందారు. క్లింకార ఇప్పడు అందరికంటే పెద్ద అక్కగా ప్రమోట్‌ అయిపోయింది. మీతో కలిసి ఆడుకునేందుకు మీ అన్నయ్య వాయువ్‌ ఎదురుచూస్తున్నాడు. రామ్‌ చరణ్‌, ఉపాసనలకు డబుల్‌ అభినందనలు' అంటూ లావణ్య ట్వీట్‌ చేసింది. లావణ్య, వరుణ్‌ దంపతులకు గతేడాదిలో వాయువ్‌ జన్మించిన విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)