Breaking News

కొత్త ఛాప్టర్‌ ప్రారంభం.. 'సుష్మిత' మరో ముందడుగు

Published on Sat, 01/24/2026 - 07:59

చిత్ర పరిశ్రమలో హీరో కొడుకు హీరో అవడం అనేది పెద్ద విషయం కాదు.. దర్శకుడి కుమారుడు మెగాఫోన్‌ పట్టుకునే ఛాన్స్‌ ఉంది. అదే ఒక స్టార్‌ హీరో కూతురు నిర్మాతగా  ఎంట్రీ ఇచ్చి సత్తా చాటితే ఎవరైనా సరే శభాష్‌ అనాల్సిందే. చిరంజీవి  తనయ సుష్మిత కొణిదెల నిర్మాతగా కోట్ల రూపాయల వ్యవహారాల్నీ చాకచక్యంగా పూర్తి చేయగలనని  'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో  విజయం సాధించారు. చిరు జోక్యం లేకుండానే ఈ మూవీ డిస్ట్రీబ్యూషన్‌ నుంచి అన్ని వ్యవహారాలను ఆమె దగ్గరుండి చూసుకున్నారు.

సుస్మిత తన చదువు పూర్తయ్యాక 'నిఫ్ట్‌'లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు. అనంతరం సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చారు. రంగస్థలం, ఖైదీ నెంబర్‌ 150, సైరా, ఆచార్, వాల్తేరు వీరయ్య  సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేశారు.  తర్వాత 'గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌' (Gold Box Entertainment) పతాకంపై ‘శ్రీదేవి శోభన్‌బాబు’ పేరుతో నిర్మాతగా కొత్త జర్నీ ప్రారంభించారు.  ఆ తర్వాత తన తండ్రితో మన శంకర వరప్రసాద్ గారు మూవీ తెరకెక్కించి భారీ హిట్‌ అందుకున్నారు.

ఇదే స్పీడ్‌తో ఆమె మరో కొత్త ఛాప్టర్‌ను ప్రారంభించారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ హిట్‌ తర్వాత 'గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌' సంస్థ కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు చిన్న గదికి పరిమితమైన ఆ సంస్థ ఇప్పుడు మరో ముందు అడుగు వేసింది. తమ బ్యానర్‌ నుంచి భారీ బడ్జెట్‌తో పాటు పెద్ద సినిమాలు వస్తాయని సుస్మిత అన్నారు. ఈ క్రమంలోనే తన టీమ్‌తో కేక్‌ కట్‌ చేసి ఒక వీడియోను షేర్‌ చేశారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)