Breaking News

1965 యదార్థ ఘటన ఆధారంగానే సూర్య కొత్త సినిమా

Published on Thu, 12/07/2023 - 06:46

పాత్రలో పరకాయ ప్రవేశం చేసే అతికొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. అలా ఆయన ఇటీవల నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్‌ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందాయి. ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్నారు. చారిత్రక కథాచిత్రంగా రూపొంతున్న ఈ చిత్రం కోసం సూర్య తనను తాను చాలానే మార్చుకున్నారు. ఒక విప్లవ నాయకుడిగా సూర్య గెటప్‌, ఆ చిత్రం గ్లిమ్స్‌ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం రూపొందించడంతో పాటు 36 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే పేర్కొన్నారు.

కంగువ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా తెరపై రావడానికి ముస్తాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను కూడా సూర్య పూర్తి చేశారు. దీంతో ఆయన తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన ఆకాశం నీ హద్దురా అనే సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇదే చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నిర్మాతగా హిందీలో నిర్మించి సక్సెస్‌ అయ్యారు. కాగా ఈ కాంబినేషన్‌లో మూడోసారి చిత్రం తెరకెక్కనుంది. దీన్ని నటుడు సూర్యనే తన 2డీ ఎంటర్‌ టెయిన్మెంట్‌ పతాకంపై నిర్మించనున్నారు.

ఇది కూడా 1965 ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. అప్పట్లో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే ఈ చిత్రానికి నేపథ్యం అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1965లో భాషాయుద్ధంలో మరణించిన రాజేంద్రన్ ఫోటో, సూర్య ఫోటోలు ఒకేసారి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇందులో సూర్య కాలేజీ విద్యార్థిగా నటించనున్నారు.

ఇందుకోసం ఆయన కాలేజీ బుల్లోడుగా మేకోవర్‌ అవ్వడానికి తన సతీమణి జ్యోతికతో కలిసి ముంబైలో మకాం పెట్టినట్లు సమాచారం. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ముఖ్య భూమిక పోషించడం ఉండగా, నటి నజ్రియా కథానాయకిగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా ఈ చిత్రం వచ్చే నెల సెట్‌ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)