Breaking News

'కంగువా'పై విమర్శలు.. కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్‌

Published on Tue, 11/19/2024 - 17:51

సూర్య హీరోగా నటించిన కంగువా సినిమాపై డివైడ్‌ టాక్‌ రావడంతో మేకర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్‌ 14న విడుదలైంది. సుమారు రూ. 350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటి వరకు కేవలం రూ. 160 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. కంగువా మొదటి  అరగంట అనుకున్న స్థాయిలో లేదని ప్రేక్షకులు చెప్పిన మాట నిజమేనని జ్యోతిక కూడా తెలిపింది.  సినిమా ప్రారంభమే కాస్త బోర్‌గా ఉండటంతో కంగువాపై భారీ ప్రభావం చూపిందని చెప్పవచ్చు.

కంగువా చిత్రం రెండో భాగం చాలా బాగుందని రివ్యూస్‌ వచ్చాయి. ఫైనల్‌గా మొదటి అరగంటపై ఎక్కువ విమర్శలు రావడంతో అందులో నుంచి 12 నిమిషాల నిడివిని కత్తిరించారు. ఇప్పుడు ఈ చిత్రం రన్‌టైమ్‌ 2.22గంటలు మాత్రమే ఉండనుంది.  ఈ సినిమా సౌండ్‌ విషయంలో కూడా విమర్శలు వచ్చాయి. దీనిని కూడా రెండో రోజుకే టెక్నికల్‌గా సరిచేశారు. అదేరోజు సినిమా రన్‌టైమ్‌ కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేదని అభిమానులు కూడా అనుకుంటున్నారు.

ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌తో ఈ కాలానికి సంబంధించిన సన్నివేశాల్ని ట్రిమ్ చేశారని తెలుస్తోంది.  గోవా ఎపిసోడ్‌ కాస్త ఎక్కువ బోరింగ్‌గా ఉండటంతో చాలా సీన్లు లేపేశారని సమాచారం. వెయ్యేళ్ల కింద‌టి కథ‌కు, వ‌ర్తమాన కాలానికి లింక్‌ పెడుతు కంగువా చిత్రాన్ని తెరకెక్కించారు. కంగువా, ఫ్రాన్సిస్‌ పాత్రల్లో సూర్య నటన అందరినీ ఆకట్టుకుంది. దిశా పటానీ చిన్న పాత్రలో మెరిసినప్పటికీ తన గ్లామర్‌తో ఫిదా చేస్తుంది. బాబీ  గ్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మించారు.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)