Breaking News

కాస్టింగ్‌ కౌచ్‌.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: హీరోయిన్‌

Published on Thu, 07/24/2025 - 13:58

అవకాశాలిస్తాం.. మరి మాకేంటి? ఒకానొక దశలో ఈ మాటలు వినీవినీ విసిగిపోయానంటోంది హీరోయిన్‌ సుర్వీన్‌ చావ్లా (Surveen Chawla). కాస్టింగ్‌ కౌచ్‌ వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానంది. అయినప్పటికీ ఇండస్ట్రీలో ధైర్యంగా నిలబడ్డానంది. సుర్వీన్‌ చావ్లా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ మండల మర్డర్స్‌. ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 25 నుంచి ప్రసారం కానుంది.

అసహ్యంగా అనిపించింది
ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో సుర్వీన్‌ చావ్లా మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో కాస్టింగ్‌ కౌచ్‌ చాలా ఎక్కువగా ఉండేది. ఏం చేయాలన్నా మాకేంటి? అని చెండాలంగా మాట్లాడేవారు. ఆ పరిస్థితుల్లో నాకు బయటకు వెళ్లాలంటే కూడా అసహ్యంగా అనిపించేది. అసలు ఇవన్నీ నాకు అవసరమా? అని తిట్టుకునేదాన్ని. యాక్టింగ్‌ మానేయాలన్నంత కోపం వచ్చేది. వాళ్లు అడిగినదానికి ఒప్పుకోకపోవడం వల్ల ఎన్నో అవకాశాలు చేజారాయి. చివరకు రోడ్డుమీద పడ్డట్లు అనిపించింది. 

వెబ్‌ సిరీస్‌లతో టాప్‌..
ఆ రోజులు చాలా కష్టంగా గడిచాయి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చింది దీనికోసమేనా? అని నిరాశచెందేదాన్ని. నా వల్ల కాదు, సినిమాలు మానేద్దాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. సుర్వీన్‌ చావ్లా.. రాజు మహారాజు అనే తెలుగు మూవీలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. హిందీలో అగ్లీ, హేట్‌ స్టోరీ 2 వంటి మూవీస్‌ చేసింది. ఓటీటీలో సేక్ర్‌డ్‌ గేమ్స్‌, రానా నాయుడు, క్రిమినల్‌ జస్టిస్‌: ఎ ఫ్యామిలీ మ్యాటర్‌ వెబ్‌ సిరీస్‌లు చేసింది.

చదవండి: ధనుష్‌ సంచలన నిర్ణయం.. రాజకీయాల్లోకి రానున్నారా..?

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)