Breaking News

Suriya 41: ‘అచలుడు’గా వస్తు‍న్న సూర్య, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Published on Tue, 07/12/2022 - 09:13

సూర్య హీరోగా బాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య 41(Suriya 41) అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌. 2డి ప్రొడక్షన్‌లో భార్య జ్యోతికతో కలిసి సూర్య స్యయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ను  డైరెక్టర్ బాల పుట్టినరోజు సందర్భంగా మేక‌ర్స్ రిలీజ్ చేశారు. సోమవారం(జూలై 11న) డైరెక్టర్‌ బాల బర్త్‌డే. ఈ సందర్భంగా మూవీ టైటిల్‌ను వణంగన్‌(తెలుగలో అచలుడు)గా ఖరారు చేశారు. ‘అచలుడు’ అంటే.. దేనికి చలించనివాడు అని అర్థం. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సూర్య చిరిగిన‌ గుడ్డలోంచి గంభీరంగా చూస్తు కనిపించాడు.

చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి

ఈ సినిమాలో సూర్య మ‌త్స్యకారునిగా కనిపిస్తాడని మూవీ వర్గాలు అంటున్నాయి. కాగా దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య- డైరెక్టర్ బాలా క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. వీరిద్దరూ గతంలో నందా (2001), పితామగన్ (2003) సినిమాల్లో క‌లిసి ప‌నిచేశారు. 2003లో రిలీజ్ అయిన యాక్షన్-డ్రామా మూవీ పితామగన్లో చియాన్ విక్రమ్ కూడా నటించాడు. ఈ సినిమాలో విక్రమ్ తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా గెలుచుకున్నాడు. పితామగన్ మూవీ ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అందులో సూర్య ఉత్తమ సహాయ నటుడిగా, బాలకు ఉత్తమ దర్శకుడు, విక్రమ్‌కు ఉత్తమ నటుడుగా, లైలాకు ఉత్తమ నటి, సంగీతకు ఉత్తమ సహాయ నటిగా పురస్కారం దక్కింది.

చదవండి: ఈ దసరాకు బరిలో దిగే చిత్రాలివే.. తలపడనున్న చిరు-నాగ్‌

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)