Breaking News

ప్రముఖ ఆలయంలో సూర్య పూజలు..

Published on Fri, 05/31/2024 - 18:13

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో సూర్య తన కొత్త సినిమాను ప్రారంభించాడు. కోలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌  కార్తీక్‌ సుబ్బరాజు కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్‌ సెట్‌ అయిన విషయం తెలిసిందే. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే, అండమాన్‌ దీవుల్లో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ప్రారంభమైంది.

సూర్య కెరియర్‌లో ఈ చిత్రం 44వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుంది. వినోదంతో పాటు భారీ యాక్షన్‌ అంశాలతో ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. అండమాన్‌ దీవుల్లో తాజాగా ప్రారంభమైన తొలి షెడ్యూల్‌ దాదాపు 40రోజుల పాటు అక్కడే కొనసాగనుంది. అయితే,  ఈ సినిమా షూటింగ్‌ కోసం ఆండమాన్‌ వెళ్లే ముందు ఆయన ప్రముఖ ఆలయంలో పూజలు నిర్వహించారు.  

చెన్నైలో ప్రముఖ ఆలయంగా గుర్తింపు ఉన్న శ్రీ కాళికాంబాల్ (కామాక్షి) సన్నిధిలో సూర్య పూజలు చేశారు. సుమారు 500 ఏళ్లకు పైగానే ఈ ఆలయానికి చరిత్ర ఉంది. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 1677న అక్టోబర్ 3న ఈ ఆలయాన్ని సందర్శించారు. తమిళ చిత్రపరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఆ ఆలయాన్ని సందిర్శించినవారే కావడం విశేషం.

ఆ ఆలయంతో 'బాబా' సినిమాకు లింక్‌
రజనీకాంత్‌ బాబా సినిమాకు ముందు ఒకరోజు కాళికాంబాల్‌ ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆయన సుమారు 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు. అయితే, అమ్మవారిని దర్శించుకున్న రజనీ ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ గుడిని మరిచిపోలేకపాయారట. ధ్యానం చేసిన సమయంలో ఆయన మనసులో ఏమైతే కలిగిందో దానినే బాబా సినిమాకు లింక్‌ చేశారట. ఆ సినిమా పెద్దగా మెప్పించకపోయిన రజనీకి మాత్రం బాబా చాలా ప్రత్యేకం అని అంటారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)