Breaking News

సూర్య డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై మళ్లీ ఆశలు.. ఈ ఏడాదిలో ప్రారంభం

Published on Thu, 06/27/2024 - 07:16

కోలీవుడ్‌ టాప్‌ హీరో సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కంగువా'. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయింది. కానీ, కంగువా విడుదలై తేదీని మేకర్స్‌ ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో  సూర్య తన 44వ చిత్రాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సూర్య ప్రధాన పాత్రలో   'వాడివాసల్‌' చిత్రాన్ని డైరెక్టర్‌ వెట్రిమారన్‌ తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటికి కొన్ని కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. సూర్య డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కావడంతో ఎలాగైనా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన ఉన్నారు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా జల్లికట్టు నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం సూర్య జల్లికట్టుపై శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్‌, ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

అయితే వెట్రిమారన్‌ హాస్యనటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ విడుదలై (తెలుగులో విడుదల) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ను కూడా ఆయన పూర్తిచేశాడు. సూర్య, వెట్రిమారన్‌ ఇద్దరూ ఇప్పుడు తమ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసుకుని ఉన్నారు. దీంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాడివాసల్‌ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించాలని ఉన్నట్లు సమాచారం.
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)