Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా
Breaking News
అమెజాన్ ప్రైమ్‌లో సూర్య కొత్త సినిమా, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Published on Fri, 10/01/2021 - 21:44
తమిళ హీరో సూర్యకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతూ వస్తున్నాయి. ఇటీవల ఆయన నటించిన 'సూరరై పోట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో రిలీజై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలైన విషయం తెలిసిందే!
తాజాగా సూర్య నటించిన మరో చిత్రం 'జై భీమ్' కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. ఇందులో సూర్య లాయర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ఈమేరకు ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటన వెలువడించింది. కాగా జై భీమ్ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, లిజొమోల్ జోస్, రాజీశ విజయన్, మణికందన్ ముఖ్యపాత్రలు పోషించారు.
Tags : 1