ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
Breaking News
మాస్ వీరభద్రుడు
Published on Wed, 05/06/2026 - 02:11
సూర్య హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల కానుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సినిమా సెన్సార్ పూర్తయిందని, సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందనీ మేకర్స్ తెలిపారు.
‘‘మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘వీరభద్రుడు’. ఈ మూవీని ఆర్జే బాలాజీ తనదైన శైలిలో తెరకెక్కించారు. తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల్లో పాపులర్ కంటెంట్‌ను అందించి, అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరు తెచ్చుకున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘వీరభద్రుడు’ని భారీ స్థాయిలో నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలని సృష్టించాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్, కెమెరా: జీకే విష్ణు.
Tags : 1