నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!
Breaking News
సూర్య 'కంగువ' రెండో లుక్.. ఆ హిట్ సినిమా గుర్తొచ్చిందిగా!
Published on Tue, 01/16/2024 - 14:40
నేషనల్ అవార్డ్ విన్నర్, తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. చారిత్రక నేపథ్యంతో డైరెక్టర్ శివ దీన్ని తీస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. త్రీడీలోనూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో 'కంగువ' సెకండ్ లుక్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?)
ఈ సెకండ్ లుక్ పోస్టర్లో సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్తోనూ సర్ప్రైజ్ చేశాడు. 'విధి.. కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్.. కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే కంగువ ' అనే క్యాప్షన్తో సెకండ్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్ దెబ్బకు 'కంగువ'పై అంచనాలు పెరుగుతున్నాయి. అదే టైంలో సూర్య '24' సినిమాలో ఆత్రేయ పాత్ర గుర్తొచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?)
அனைவருக்கும் இனிய பொங்கல் மற்றும் தமிழர் திருநாள் வாழ்த்துகள்!
— Suriya Sivakumar (@Suriya_offl) January 16, 2024
Happy Pongal!
मकर संक्रांति शुभकामनाएँ!
ಎಲ್ಲರಿಗೂ ಸಂಕ್ರಾಂತಿ!ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು!
అందరికి సంక్రాంతి!శుభాకాంక్షలు! #Kanguva #Kanguva2ndLook pic.twitter.com/Xe1yQ89nf4
Tags : 1
