Breaking News

'కంగువ' స్పెషల్ పోస్టర్.. ఆ సినిమా గుర్తొచ్చిందిగా!

Published on Mon, 04/15/2024 - 15:44

సూర్య కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువ'. బాలీవుడ్‌ బ్యూటీ దిశాపటానీ ఈ చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమవుతోంది. శివ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తోంది.

పీరియాడికల్‌, ప్రస్తుత అంశాలతో కూడిన ఈ చిత్రంలో సూర్య గెటప్‌, టీజర్‌ ఇప్పటికే చిత్రంపై భారీ అంచనాలను పెంచేశాయి. చిత్రాన్ని 3డీ ఫార్మాట్‌లో, 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా పోస్టర్‌ను తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం విడుదల చేశారు.

(ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?)

అందులో పీరియడ్‌ కాలానికి చెందిన సూర్య ఫొటోను, మరో పక్క ప్రస్తుత ఫొటోను పొందుపరచారు. మధ్యలో 2024లో విడుదల అని పేర్కొన్నారు. దీంతో కంగువా చిత్రంలో సూర్య రెండు డిఫరెంట్‌ పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియడ్‌ పాత్రధారి చేతిలో కత్తి పట్టుకోగా, ప్రస్తుతం పాత్రధారి చేతిలో తుపాకీ పట్టుకున్న దృశ్యం ఈ పోస్టర్‌కు ఎట్రాక్షన్‌గా మారింది.

అదేవిధంగా ఇది గత జన్మకు, పునర్‌జన్మకు సంబంధించిన కథా చిత్రం అని కూడా అనిపిస్తోంది. దాదాపు ఇలాంటి కాన్సెప్టుతోనే ఈ మధ్య 'బింబిసార' అనే మూవీతో తెలుగులో వచ్చింది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు అదే చిత్రం గుర్తొస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)