Breaking News

దీన స్థితిలో ప్రముఖ నిర్మాత, అండగా నిలిచిన స్టార్‌ హీరో

Published on Tue, 03/07/2023 - 12:58

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ నిర్మాతకు అండగా నిలిచాడు స్టార్‌ హీరో సూర్య. అగ్ర హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన తమిళ నిర్మాత వీఏ దురై ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. కొంతకాలంగా ఆయన మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం శికిత్స కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఆయనకు అండగా నిలిచారు. ఆయన వైద్యం కోసం రూ. 2 లక్షలు సాయం ప్రకటించారు. అంతేకాదు మరింత సాయం అందిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు.

చదవండి: లాక్‌డౌన్‌లో తీవ్ర ఆర్థిక కష్టాలు.. అంతలోనే లగ్జరీ హోం..!: రఘు ఇల్లు చూశారా?

అలాగే తమిళ పరిశ్రమకు చెందిన మరికొందరు కూడా ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దురై మొదట్లో ప్రముఖ నిర్మాత ఏఎం రత్ననాథ్‌తో కలిసి ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో పనిచేశారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థ ఎవర్‌గ్రీన్ ఇంటర్నేషనల్ ప్రారంభించి పలు చిత్రాలు నిర్మించారు. అయితే, ఆ తర్వాత నష్టపోయి కుదేలయ్యారు. ప్రస్తుతం ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇప్పుడు వైద్య సాయం అవసరమని, కనీసం ఆయన చికిత్స కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటూ ఆయన స్నేహితుడు ఒకరు ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చదవండి: ఆస్కార్‌ అవార్డుల వేడుక లైవ్‌ స్ట్రీమింగ్‌ ఈ ఓటీటీలోనే.. ఎప్పుడంటే!

కాగా ఆయన తమిళ సూపర్  స్టార్ రజనీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటివారితో సినిమాలు నిర్మించారు. దురై నిర్మించిన చివరి సినిమా గజేంద్ర. అంతకుముందు పితామగన్, లవ్‌లీ, లూటీ వంటి చిత్రాలను నిర్మించారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన పితామగన్ సినిమాలో సూర్య, విక్రమ్ కలిసి నటించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. దురైకి సొంత ఇల్లు కూడా లేదని, చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ధీన స్థితిలో ఉన్నట్లు ఆయన స్నేహితుడు తెలిపాడు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)