Breaking News

'ఖైదీ' సీక్వెల్‌లో మరో పాన్‌ ఇండియా హీరో

Published on Sun, 11/03/2024 - 12:22

కోలీవుడ్‌ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ తన కెరియర్‌లో రెండవ సినిమాగా ఖైదీ విడుదలైంది. నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్స్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఖైదీ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌, నటుడు కార్తీ చెప్పారు. అయితే ఆ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ అయ్యారు. అదే విధంగా లోకేష్‌ కనకరాజ్‌ నటుడు కమలహాసన్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన విక్రమ్‌ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది ఆ చిత్రం చివరిలో నటుడు సూర్య రోలెక్స్‌ పాత్రలో డాన్‌గా మెరిశారు. 

అదేవిధంగా ఖైదీ చిత్రంలో కార్తీ పాత్ర పేరు ఢిల్లీ. కాగా అన్నదమ్ములైన సూర్య, కార్తీ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. దీంతో సూర్య, కార్తీలను ఎప్పుడు చూసినా రోలెక్స్‌, డిల్లీ కలిసి నటించే విషయం గురించే అడుగుతుంటారు. ఇటీవల నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలో జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో కార్తీ అతిథిగా పొల్గొన్నారు. దీంతో అభిమానులు మరోసారి రోలెక్స్‌, డిల్లీ కలిసి ఎప్పుడు నటిస్తారు అంటూ ప్రశ్నించారు. దీంతో సూర్య త్వరలోనే ఖైదీ – 2 చిత్రం ప్రారంభం అవుతుందని అందులో తమ్ముడు కార్తీతో కలిసి తాను నటిస్తానని చెప్పారు. 

అదేవిధంగా దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కూడా వచ్చే ఏడాది ఖైదీ– 2 చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుందని ఒక భేటీలో చెప్పారు. దీంతో సూర్య, కార్తీ కలిసి నటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం లోకేష్‌ కనకరాజ్‌ నటుడు రజనీకాంత్‌ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన చేసే చిత్రం ఖైదీ– 2 నే అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)