సూర్య అంటే చేయూత!

Published on Wed, 07/23/2025 - 14:33

సాక్షి, చెన్నై: సేవా గుణం కలిగిన అతి తక్కువ మంది తమిళ నటుల్లో సూర్య ముందుంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. ఈ నటుడిలో ఎంత పెద్ద కథానాయకుడు ఉన్నాడో అంత మంచి విద్యాదాత ఉన్నారు. విద్యాదానంలో తన తండ్రి నటుడు శివకుమార్‌ను స్ఫూర్తిగా తీసుకొని సూర్య అగరం ఫౌండేషన్‌ ద్వారా అనేక మందిని చదివిస్తూ వారి ఉన్నత కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిభ ఉండి చదువుకునే స్థోమత లేని పేద విద్యార్థులకు ప్రతి ఏడాది ఆర్థికసాయం, ప్రశంసా పత్రాలతో ప్రోత్సహిస్తున్నారు. ఈయన సేవా దాతృత్వం గురించి ఇటీవల స్టంట్‌ మాస్టర్‌ సెల్వ చెబుతూ గత పదేళ్లుగా సూర్య తమిళ సినిమాకు సంబంధించిన స్టంట్‌ మాస్టర్లకు ఏడాదికి అందరికి కలిపి రూ.10లక్షలు ఇన్సూరెన్స్‌ కడుతున్నారని చెప్పారు. 

ఈ విషయాన్ని ఆయన ఎవరితోనూ చెప్పలేదని పేర్కొన్నారు. అంతటి మానవత్వం కలిగిన సూర్య బుధవారం 50 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో నాలుగు రోజుల నుంచే ఆయన అభిమానులు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు. అలా సూర్య సేవా సంఘం తరఫున ఉత్తర చెన్నై ప్రాంతంలో రూ.2లక్షల విలువైన సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కుట్టుమిషన్లు, 150 మంది మహిళలకు చీరలు, 50 మంది పురుషులకు పంచెలు, 150 మంది విద్యార్థులకు చదువు ఉపకరణాలు, 150 మంచి నీటి బిందెలు, పదిమంది వృద్ధులకు ఆర్థికసాయం అందించారు.

 ఈసేవా కార్యక్రమంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సహ నిర్మాత రాజశేఖర్‌ పాండియన్‌ పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 45వ చిత్రం కడుప్పు. ఈ చిత్రం దీపావళికి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తన 46 వ చిత్రాన్ని టాలీవుడ్‌ టాలెంటెడ్‌ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు.  

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)