Breaking News

500 మంది డ్యాన్సర్లతో త్రిష మాస్‌ జాతర సాంగ్‌

Published on Sun, 03/23/2025 - 07:45

కోలీవుడ్‌ నటుడు సూర్య, నటి త్రిష మాస్‌ జాతర సాంగ్‌తో తెరపై దుమ్ము రేపటానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఈ పాటలో 500 మంది డాన్సర్లు పాల్గొనబోతున్నారు. ఇది ఏచిత్రం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.  సూర్య తన 45వ చిత్రాన్ని  డ్రీమ్‌ వారియర్‌  పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో ఆయన ప్రతి నాయకుడిగానూ  నటిస్తున్నట్లు సమాచారం. కాగా నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఇందులో నటి శ్వాసిక , ఇందిరస్‌, యోగిబాబు, షివాద, సుప్రీత్‌రెడ్డి, నట్టి నటరాజ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

కాగా ఇందులో నటుడు సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసింది. అందులో ఒకటి న్యాయవాది పాత్ర అని సమాచారం. అదేవిధంగా ఇది న్యాయస్థానంలో జరిగే కేసు నేపథ్యంగా సాగే వైవిద్య భరిత కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. తదుపరి చెన్నైలోని ఈ సీ ఆర్‌రోడ్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఒక మాస్‌ జాతర పాటను  చిత్రీకరించడానికి యూనిట్‌ సన్నద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సాయి అభయంకర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన  ఫోక్‌ సంగీత బాణీలు కట్టిన ఈ  మాస్‌ జాతర పాటలో సూర్య, త్రిషలతో పాటు 50 మంది డాన్సర్లు నటించబోతున్నట్లు  తెలిసింది. 

దీనికి శోభి మాస్టర్‌ నృత్య దర్శకత్వం వహించనున్నారని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. ఈ ఒక్క పాట కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. నటుడు సూర్య నటించిన రెట్రో మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.  కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. నటి పూజా హెగ్డే కథానాయకిగా నటించిన ఈ చిత్రం మే 1న   తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)