Breaking News

అందుకే ఆ పెద్దాయన అప్లికేషన్‌ తీసుకోలేదు: కేంద్రమంత్రి సురేశ్‌ గోపీ

Published on Mon, 09/15/2025 - 13:03

మలయాళ ప్రముఖ నటులు, త్రిశ్శూర్‌ ఎంపీ, కేంద్రమంత్రి సురేష్‌ గోపీని సాయం చేయాలని కొద్దిరోజుల క్రితం ఓ వృద్ధుడు కోరాడు. అయితే, దానిని ఆయన తిరస్కరించారు. దీంతో ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఆపై అక్కడి రాజకీయ ప్రత్యర్దులు కూడా ఆయనపై విరుచుకపడ్డారు. ఈ అంశంపై తాజాగా కేంద్రమంత్రి సురేష్‌ గోపీ రియాక్ట్‌ అయ్యారు.

ఇటీవల కేరళలో జరిగిన ఓ ర్యాలీలో  సురేశ్‌ గోపీ పాల్గొన్నారు. ఆ సమయంలో ఇల్లు కట్టుకోవడానికి సహాయం కోరుతూ ఒక వృద్ధుడు ఇచ్చిన దరఖాస్తును ఆయన స్వీకరించలేదు. అందుకు సంబంధించి సురేష్ గోపీ ఇలా వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని కొందరు రాజకీయ ఎజెండాగా ఉపయోగిస్తున్నారని ఆయన తప్పుబట్టారు.

'ఒక ప్రజా సేవకుడిగా, ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు అనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నిలబెట్టుకోలేని వాగ్దానాలు నేను చేయలేను. గృహ నిర్మాణం అనేది రాష్ట్ర సమస్య. కాబట్టి, అలాంటి అభ్యర్థనలను  నేను ఒక్కడినే మంజూరుచేయలేను. రాష్ట్ర ప్రభుత్వమే దాని గురించి ఆలోచించాలి. ఈ సంఘటన ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇంటిని మంజూరు చేసింది.

ఈ విషయం తెలిసిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. ఇది రాజకీయంగా ప్రేరేపించబడినప్పటికీ, నా వల్ల అతనికి మంచి జరిగింది. గత రెండు సంవత్సరాలుగా ప్రజలు దీనిని గమనిస్తున్నారు.నా వల్ల ఇల్లు అందించడానికి వారు ముందుకు వచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నా ప్రయత్నాలు ఎల్లప్పుడూ వ్యవస్థలో పనిచేయడం, ప్రజలకు నిజమైన ప్రయోజనాలను అందించడంపైనే ఉంటాయి.' అని ఆయన అన్నారు.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)