గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు
Breaking News
పర్సనల్ వీడియో వైరల్.. నటి సురేఖావాణి సీరియస్
Published on Sat, 11/07/2026 - 12:03
సహాయ నటిగా తెలుగులో చాలా సినిమాలు చేసిన సురేఖావాణి ప్రస్తుతం మూవీస్లో ఎక్కువగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. ఇది నిజమా? లేదంటే ఏఐ వీడియోనా అని నెటిజన్లు అనుకుంటున్న టైంలో సురేఖావాణినే స్వయంగా పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. సదరు వీడియో షేర్ చేస్తున్న వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
(ఇదీ చదవండి: బిగ్బాస్ 10: ముకేశ్ కోసం వర్షిణి త్యాగం.. కొత్త కెప్టెన్ ఎవరంటే?)
'నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయింది. నా అనుమతి లేకుండానే నా వ్యక్తిగత/ప్రైవేట్ కంటెంట్.. వైరల్ అవుతోంది. దాన్ని షేర్ చేయొద్దని మీమ్ పేజీలు, మీడియా, ప్రెస్ సభ్యుల్ని కోరుతున్నాను. ఒకవేళ ఎవరైనా షేర్ చేస్తే గనుక వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. ఈ పరిస్థితిని వ్యూస్ కోసమో రీచ్ కోసమో పబ్లిసిటీ కోసమో ఉపయోగించుకోవద్దు. నా గోప్యతని గౌరవించండి. ఇది చాలా సీరియస్ మేటర్' అని సురేఖావాణి పోస్ట్ పెట్టింది.
సురేఖావాణి వ్యక్తిగత విషయానికొస్తే ఈమె భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయారు. ఇక కూతురు సుప్రీతని కూడా తనలానే సురేఖావాణి.. నటిని చేసింది. ప్రస్తుతం సుప్రీత నటిగా పలు సినిమాలు చేస్తోంది.

(ఇదీ దవండి: ఓటీటీలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)
Actor: #SurekhaVani released a statement on social media regarding her viral video. https://t.co/AUhfYzzDM7
— Karthik (@Wanderwthkarth) November 7, 2026
Tags : 1