Breaking News

భర్త పోయిన తర్వాత విచ్చలవిడిగా..: ఏడ్చేసిన సురేఖ

Published on Wed, 03/13/2024 - 12:43

సురేఖా వాణి.. క్యారెక్టర్‌ ఆ‍ర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే ఈమెకు సుప్రిత అనే కూతురు ఉంది. ఈమె కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ తల్లీకూతుళ్లు సోషల్‌ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటారు. అయితే వారిని కొందరు అదేపనిగా ట్రోల్‌ చేస్తుంటారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై స్పందించింది నటి.

మొదట్లో భరించలేకపోయా..
ఓ ఇంటర్వ్యూలో సురేఖా వాణి మాట్లాడుతూ.. 'మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడిగా మారిందంటూ నన్ను ట్రోల్‌ చేస్తున్నారు. నాకు 19 ఏళ్లకే డైరెక్టర్‌ సురేశ్‌ తేజతో పెళ్లయింది. అప్పుడు పెద్దదానిలా మారిపోయాను. ఇప్పుడు నాకు 42 ఏళ్లు.. ఇరవైఏళ్ల పిల్లలా నా కూతురితో ఎంజాయ్‌ చేస్తున్నాను. నా భర్త ఉన్నా ఇలాగే ఉండేదాన్ని. మొదట్లో ఈ కామెంట్స్‌ చూసి భరించలేకపోయాను. తర్వాత వీళ్లు మారరని వదిలేశాను. ప్రతివాడి నోరు మూయించలేం కదా.. నాగురించి వీడియోలు తీస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సింగిల్‌ పేరెంట్‌ను, కాబట్టి ఇలాంటి విమర్శలు, ఎత్తిపొడుపులు ఎలాగో ఉంటాయి.

తేజతో మాట్లాడాలనుంది
నా భర్త ఆస్పత్రిపాలైనప్పుడు ఎంత ఏడ్చానో.. ఎంత బాగా చూసుకున్నానో! కానీ అతడి ఆరోగ్యం బాగోలేనప్పుడు నేనసలు పట్టించుకోలేదని తేజ వాళ్ల కుటుంబసభ్యులు తప్పుగా అనుకున్నారు. అతడికి డయాబెటిస్‌ ఉండటంతో గుండెలో నొప్పి తెలియలేదు. సడన్‌గా హార్ట్‌ బీట్‌ ఆగిపోయింది. దేవుడు ఒక గంట అవకాశమిస్తే తేజతో మనసువిప్పి మాట్లాడాలనుంది. కనీసం కలలో అయినా తేజ కనిపిస్తే తనతో మాట్లాడాలనుంది. తనను క్షమించమని అడగాలనుంది. మళ్లీ పెళ్లి చేసుకోమని ఇంట్లోవారు అడిగారు. కానీ నాకు రెండో పెళ్లి ఇష్టం లేదు.

నాకంటూ సొంతిల్లు లేదు
నాకు ఎవరితోనో ఎఫైర్లు ఉన్నాయి. అందుకే లగ్జరీగా బతుకుతున్నానని చాలామంది అనుకుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ మధ్యే నా ప్రాపర్టీ కూడా అమ్మేశాను. ఇప్పటివరకు నాకు సొంతిల్లు కూడా లేదు. కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో నన్ను అనవసరంగా ఇరికించారు. అప్పుడు నేను మానసికంగా ఎంత నరకం చూశానో.. నెలరోజులు డిప్రెషన్‌లో ఉండిపోయాను. ముద్ద దిగక.. ఏడుస్తూ కూర్చుండిపోయా.. మీ చెడు తిరుగుళ్ల వల్లే ఇదంతా అని నోటికొచ్చింది తిట్టారు. నేను అమెరికాకు వెళ్తే పారిపోయిందన్నారు. అక్కడికి వెళ్లొచ్చాక ఈ కామెంట్లను పట్టించుకోవడం మానేశాను. ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించమని తిరుమలస్వామివారిని కోరుతూ గుండు చేయించుకున్నాను' అంటూ కంటతడి పెట్టుకుంది సురేఖ.

చదవండి:  చిన్న సినిమాకు పెద్ద రివ్యూ ఇచ్చిన మహేశ్

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)