Breaking News

సుప్రీం కోర్టులో విజయ్‌ సినిమాకు భారీ ఎదురు దెబ్బ

Published on Thu, 01/15/2026 - 11:38

తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్‌ విజయ్‌ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’(Jana nayagan) కి సుప్రీం కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది.  సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీకి స్టే విధించిన మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్‌ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ వేసిన పిటిషన్‌ని విచారించకుండానే హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తిరిగి పంపింది. ఈ నెల 20వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని మద్రాసు హైకోర్టుకు సూచించింది. 

ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఆలస్యమైంది. సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇవ్వకపోవడంతో, నిర్మాతలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాకు వెంటనే సెన్సార్‌ సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సిందిగా 9వ తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సీబీఎఫ్‌సీని ఆదేశించింది. అనంతరం, కొద్ది గంటల్లోనే సీబీఎఫ్‌సీ వినతిపై స్పందించిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. 

దీంతో చిత్ర నిర్మాతలు ఈ నెల 12న సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను ఎంటర్‌టైన్ చేయకుండా, హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తిరిగి పంపింది. హైకోర్టు జనవరి 20లోపు ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)