Breaking News

మోహన్‌ బాబును జైలుకు పంపాలా..? నష్టపరిహారం కావాలా..?: సుప్రీంకోర్టు

Published on Thu, 01/09/2025 - 11:56

కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో  సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో (Supreme Court ) స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్‌ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జరిగే వరకు మోహన్‌బాబుపై (Mohan Babu) ఎలాంటి చర్యలు తీసుకోకవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

అయితే, విచారణలో భాగంగా న్యాయస్థానం పలు ప్రశ్నలు అడిగింది. జర్నలిస్టులు లోపలికి వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా.. ? అంటూ  నటుడు మోహన్ బాబును  సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అది ఆవేశంలో జరిగిన ఘటన అని, బాధితుడికి పూర్తి నష్టపరిహారం చెల్లించేందుకు  సిద్ధంగా ఉన్నట్లు మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు. 

అయితే, ఈ కేసుకు సంబంధించి నష్టపరిహారం కావాలా.. ? మోహన్ బాబును జైలుకు పంపాలా..? అని జర్నలిస్టు తరపు న్యాయవాదిని  సుప్రీంకోర్టు అడిగింది. అయితే, ఈ అంశం గురించి తదుపరి విచారణలో సమాధానం ఇస్తామని జర్నలిస్ట్ తరఫు న్యాయవాది చెప్పడంతో మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని  రంజిత్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది.

(ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే హైప్‌)

మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇలా వాదనలు వినిపించారు. జర్నలిస్టులకు ఆహ్వానం లేకుండానే ఎందుకు ఇంటికి వచ్చారని న్యాయవాది ప్రశ్నించారు. అయినప్పటికీ ఇది ఆవేశంలో జరిగిన ఘటనగా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో  జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, నష్టపరిహారం చెల్లించేందుకు మోహన్‌ బాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

ప్రస్తుతం ఆయన వయసు 76 సంవత్సరాలు కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ముకుల్‌ కోరారు. అయితే,  మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డానని జర్నలిస్ట్‌ కోర్టుకు తెలిపారు. ఆ కారణంగా ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ దాడి వల్ల వృత్తిపరంగా తనకు నష్టం జరిగిందని జర్నలిస్ట్‌ తెలిపారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)