Breaking News

ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు.. ఆమెకు చాలా డబ్బిచ్చా..: సన్నీలియోన్‌

Published on Fri, 08/29/2025 - 16:10

పిల్లలంటే ఇష్టం.. కానీ ప్రెగ్నెన్సీ అంటే అస్సలు ఇష్టం లేదంటోంది బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ (Sunny Leone). ఈ మాట ఊరికే అనలేదు. ఎన్నోసార్లు ఐవీఎఫ్‌కు వెళ్లి ఫెయిల్‌ అవడం, అనారోగ్యం బారిన పడటంతో ఆమెకు గర్భం దాల్చాలంటేనే విసుగొచ్చింది. అందుకే దత్తత ద్వారా ఓ అనాథకు తల్లిగా మారింది. అలాగే సరోగసి ద్వారా మరో ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది.

ఆరోజే దత్తత తీసుకోవాలని..
తాజాగా సన్నీలియోన్‌.. నటి సోహా అలీ ఖాన్‌ పాడ్‌కాస్ట్‌కు హాజరైంది. ఈమేరకు ఓ ట్రైలర్‌ విడుదల చేశారు. అందులో సన్నీలియోన్‌ మాట్లాడుతూ.. పిల్లల్ని దత్తత తీసుకోవాలని నా మనసులో ఎప్పటినుంచో ఉంది. ఐవీఎఫ్‌ ఫెయిలైనరోజు దత్తత కోసం అప్లికేషన్‌ పెట్టుకున్నాం. అప్పుడే ఓ పాపను ఎంచుకున్నాం. సరోగసికి ఎందుకు వెళ్లానంటే.. గర్భం దాల్చి పిల్లల్ని కడుపున మోయడం నాకిష్టం లేదు. అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నాను. 

చాలా డబ్బు ఖర్చు చేశాం
సరోగసి కోసం ఎంచుకున్న మహిళకు వారానికి ఒకసారి డబ్బు చెల్లించేవాళ్లం. ఆమె భర్తకు కూడా మనీ ఇచ్చాం. చాలా ఖర్చు చేశాం. ఆ డబ్బుతో ఆమె పెద్ద ఇల్లు కొనుక్కుంది. మరోసారి ఘనంగా పెళ్లి చేసుకుంది అని తెలిపింది. కాగా సన్నీలియోన్‌ నటుడు డేనియల్‌ వెబర్‌ను 2011లో పెళ్లి చేసుకుంది. 2017లో వీరు రెండేళ్ల పాపా నిషాను దత్తత తీసుకున్నారు. 2018లో సరోగసి ద్వారా  నోవా, ఆషర్‌ జన్మించారు.

 

 

చదవండి: 'నాకు పెళ్లయింది, అతడే నా భర్త..': జాన్వీ కపూర్‌

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)